#RRR లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అదితిరావు?

253

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image result for #RRR

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. రాజమౌళి సినిమాల్లో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది.అయితే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇతర తారాగణం ఎవరు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. విలన్ పాత్రలో కన్నడ హీరో యశ్ పేరు వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్ల గురించి ఇప్పటివరకు ఎలాంటి స‌మాచారం బయటకు రాలేదు. కీర్తి సురేశ్, కైరా అడ్వాణీ, సమంత, రాశీఖన్నా వంటి కథానాయికల పేర్లు విపిస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు.

Related image

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’లో అదితిరావ్ హైదరీని ఓ కథానాయికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితిరావ్ హైదరీ.. ‘సమ్మోహనం‌’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ‘అంతరిక్షం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామకు ఈ భారీ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఆమెకు కథ వినిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై యూనిట్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.