సౌందర్య ఆస్తులన్నీ ఏమయ్యాయో తెలుసా..?

1533

సౌందర్య గారు తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయే నటి. ఎలాంటి పాత్రలో అయిన ఇమిడిపోగల నటి ఆమె. తెలుగు వారు సౌందర్యని వాళ్ళ ఇంట్లో మనిషిలా అనుకునే వాళ్లంటే ఆమె తెలుగు ప్రజల మనస్సుల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు తీసి హిట్లు కొట్టిన నటి. సౌందర్య గారిని ఈ తరం సావిత్రమ్మ అనేవారు. తన 12 సంవత్సరాల తెలుగు సినీ కెరీర్ లో 114 సినిమాలు తీసింది. 2004 ఏప్రిల్ 17 న బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ కి వస్తుండగా విమాన ప్రమాదంలో సౌందర్య గారు మృతి చెందారు.

Image result for soundarya

ఇక సౌందర్యకు తల్లి మంజుల, భర్త జీఎస్. రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయంలో ఫామిలీ మెంబర్స్ మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఫిబ్రవరి 15న వీలునామా రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల బ్రదర్ లాయర్ కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు వేసింది.. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో కొంతకాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. చివరికి రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

సౌందర్య ఆస్తులకు మంజుల, రఘు, నిర్మల, సాత్విక్ వారసులు. తాము రాజీకి వచ్చామని, ఎలాంటి సమస్య లేదని వారందరు కోర్టుకు చెప్పి కేసును వెనక్కి తీసుకున్నారు. సౌందర్య పేరుతో మొత్తం 5 కోట్ల ఆస్థి ఉంది.. సౌందర్య పేరుతో ఉన్న రూ. 25 లక్షల బ్యాంకు డిపాజిట్, హనుమంత నగరలోని ఐదు ఇళ్లు మేనల్లుడు సాత్విక్‌కు చెందుతాయి. అదే విధంగా నిర్మలకు రూ. 1.25 కోట్ల నగదు చెందుతుంది. సౌందర్య సోదరుడు అమరనాథ్ పేరుతో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి విక్రయించి వచ్చిన నగదులో మంజుల, నిర్మల, సాత్విక్ పంచుకోవడానికి అంగీకరించారు. జాయింట్ ప్రాపర్టీ విషయంలో నిర్మల జోక్యం చేసుకోకుండ సౌందర్య తల్లి మంజులకు అప్పగించాలి. మల్లేశ్వరం, హెచ్‌ఆర్‌బీఆర్ రెండవ సెక్టార్‌లోని ఇంటి స్థలాలు, హైదరాబాద్‌లోని ఆఫీస్, హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లోని ఇంటి స్థలాలు సౌందర్య భర్త రఘుకు చెందాయి.. ఈ విషయంపై అందరు అంగీకరించడంతో కేసుకు పుల్‌స్టాప్ పడింది. అయితే సౌందర్య నిజంగా వీలునామా రాసిందా లేదా అనే విషయం మాత్రం మిస్టరీగా మారింది. ఇక సౌందర్య భర్త ఒక అమ్మాయితో సీక్రెట్ ఫామిలీ మైంటైన్ చేస్తున్నాడంట. గోవాలో ఓ అమ్మాయితో హోటల్ లో ఎంజాయ్ చేసాడంట. హోటల్ రికార్డ్ లో భార్య భర్తలు అని ఉందంట. డా. అర్పితా అనే ఆమెతో 2010 లో బెంగళూరు లోని ఓ చర్చిలో పెళ్లి జరిగిందంట. ఇలా సౌందర్య ఆస్థి గొడవ ముగిసిపోయింది. ఇక సౌందర్య మన అందరిని వదిలివెళ్ళిపోయినా తెలుగు వారు గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతారు.