హీరోయిన్స్ ను వేదించే శాడిస్ట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న 100 సినిమాల హీరోయిన్.

966

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా అనేది ఊరికే రాదు.ఎంతో కష్టపడితే కానీ ఆ హోదా రాదు. కేవలం అందాన్ని నమ్ముకుని వంద చిత్రాలలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.తన అందం నటనతో అందరికి ఆకట్టుకుని చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి స్టార్ హీరోల నుంచి జూనియర్ ఎన్టీఆర్ శ్రీకాంత్ జగపతిబాబు రాజశేఖర్ రవితేజ, సుమన్ వినోద్ కుమార్ వరకు అందరి హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి సంఘవి.మరి ఆమె ప్రస్తుతం ఎలా ఉంది.ఆమె తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for సంఘవి actress

సంఘవి కన్నడ భామ.1975 జన్మించింది.ఆమె తండ్రి మైసూర్ మెడికల్ కాలేజీలో పనిచేసేవారు.ఆయన పేరు డాక్టర్ రమేష్. తల్లి రాజన.వీరి సంతానమే సంఘవి.ఆమె అసలు పేరు కావ్య రమేష్.ఆమె నాయనమ్మ కన్నడలో ప్రముఖ నటి అయినా ఆరతి.సినిమా అవకాశాల కోసం బాగానే కష్టపడింది.అలా తమిళ్ లో అజిత్ సరసన హీరోయిన్ గా మొదటి అవకాశం వచ్చింది.ఈ చిత్రం పేరు అమరావతి. ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.అందరు స్టార్ హీరోలతో నటించింది.తెలుగు తమిళ్ కన్నడ హిందీ లలో నటించింది.మొదటి చిత్రం అజిత్ సరసన నటించిన ఆమె రెండవ చిత్రం మరొక స్టార్ హీరో విజయ్ సరసన నటించింది.ఇక ఆమె శరత్ కుమార్ ప్రభు విగ్నేష్ కార్తీక్ లతో నటించింది. రామానాయుడు ప్రొడక్షన్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఇందులో మోనికా బేడీ మరొక హీరోయిన్.వెంకటేష్ సరసన సూర్యవంశం సరదా బుల్లోడు, బాలకృష్ణ సరసన సమరసింహారెడ్డి గొప్పింటి అల్లుడు, నాగార్జున సరసన సీతారామరాజు చిత్రం, చిరంజీవితో మృగరాజు, జూనియర్ ఎన్టీఆర్ తో ఆంద్రవాలా , రజనీకాంత్ తో బాబా , కమల్ హాసన్ తో పంచతంత్రంలో నటించింది.

Image result for సంఘవి actress

ఉపేంద్ర దర్శన్ లాంటి కన్నడ స్టార్స్ తో అబ్బాస్ రాంకీ,నెపోలియన్, విజయ్ కాంత్ లాంటి తమిళ హీరోలతో నటించింది.హిందీలో మిదున్ చక్రవర్తి అర్జున్ సర్జాలతో నటించింది.కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ బ్రహ్మాజీలు జోడిగా నటించిన సిందూరం సినిమా అయితే ఆమెకు మైలురాయి.ఈ సినిమాకు ఆమెకు పలు అవార్డ్స్ కూడా వచ్చాయి.22 ఏళ్ల సినిమా కెరీర్ లో దాదాపు 100 కు పైగా చిత్రాలలో నటించింది.1998 లో వచ్చిన శివయ్య సినిమాలో నటించే సమయంలో దర్శకుడు రుద్రరాజు సురేష్ వర్మను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది.ఆ సురేష్ వర్మ ఆనాడు పెద్ద శాడిస్ట్ గా హీరోయిన్స్ ను టార్చర్ పెట్టడంతో ముందుండేవాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయన సుబ్బు సినిమా తీసేటప్పుడు ఆ సినిమా హీరోయిన్ సునాలి జోషిని లైంగికంగా వేధించాడు. అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది.సంఘవిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే శాడిజం చూపించేవాడంట.రోజు తాగడం సిగరెట్ తో కాల్చడం లాంటి వికృత చేష్టలు చేస్తుంటే తట్టుకోలేక అతని నుంచి విడిపోయింది.ఆ తర్వాత బెంగుళూర్ కు చెందిన వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రెండవ వివాహం చేసుకుంది.కొన్ని బుల్లితెర సీరియల్స్ లలో నటించింది.సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చెయ్యడానికి రెడీగా ఉన్నానని చెప్పింది.సరైన అవకాశం కోసం చూస్తున్నా అని ఆమె తెలిపింది.ఆమె మళ్ళి వెండితెర మీద నటించి మన అందరిని మెప్పించాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సంఘవి గురించి ఆమె నటన గురించి అలాగే ఆమె జీవితంలో భర్త చేతిలో ఎదుర్కొన్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.