జబర్దస్త్ లో రోజా రీ ఎంట్రీ.. షాక్ లో మీనా

351

దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా బుల్లితెరమీద కామెడీతో అలరిస్తున్న జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్‌లో ఆరుగురు టీములు రకరకాల స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోలో స్కిట్స్‌కి వచ్చే స్పందన ఎంత ఉంటుందో…అంతకు మించి స్పందన ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాకూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఇంత‌గా స‌క్సెస్ అయిందంటే కార‌ణం కంటెస్టెంట్‌లతో పాటు జడ్జీలు నాగబాబు,రోజా. కామెడీ వ‌చ్చినా లేక‌పోయినా వాళ్ళ న‌వ్వులు,కంటెస్టెంట్‌లపై వేసే సెటైర్లకు ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డిపోయారు. అలాంటి నాగబాబు,రోజా లేకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే. అయితే గత నాలుగు ఎపిసోడ్స్ లలో రోజా నాగబాబును మిస్ అవుతున్నాం. అందుకు కారణం ఎలక్షన్స్.

Image result for roja

రోజా, నాగ‌బాబు ఇప్పుడు రాజ‌కీయాల్లోనే ఉండ‌టంతో వారు ఈ షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. న‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మరోసారి ఇక్కడి నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి, అలాగే పవన్ స్ధాపించిన జనసేనలో చేరిన మెగా బ్రదర్ నాగబాబు ఆ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం జబర్దస్త్ ను వదిలేశారు. వీరి స్థానంలో మీనా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ జడ్జీలుగా చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. లీడర్స్ ఇద్దరు రిజల్ట్స్ కోసం చూస్తున్నారు. అయితే ఎన్నికల కోసం అని వదిలేసినా జబర్దస్త్ ను మళ్ళి స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు రోజా నాగబాబు.

ఈ క్రింది వీడియో చూడండి

నాగబాబు ఇప్పటికే జబర్దస్త్ ను వదిలే సమస్యే లేదని చెప్పాడు. కాబట్టి నాగబాబు వచ్చే అవకాశం ఉంది. ఇక రోజా కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. రోజా వస్తుంది అని తెలిసి మీనా కొంచెం బాదపడిందంట. నాలుగు ఎపిసోడ్స్ అప్పుడే అయిపోయాయి. జబర్దస్త్ ను వదిలేయడం నాకు ఇష్టం లేదని మీనా సన్నిహితుల దగ్గర అంటుందట. అయితే రోజా పర్మినెంట్ జడ్జి కాబట్టి మీనా వెళ్ళక తప్పడం లేదు. అయితే మీనా మళ్ళి జబర్దస్త్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అంటే.. ఒకవేళ ఎన్నికలలో వైసిపి గెలిస్తే జగన్ రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాడు. మంత్రి పదవిలో ఉండి జబర్దస్త్ చేయడం అంత సులభతర విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా జబర్దస్త్ ను వదిలేయాల్సిందే. అప్పుడు మీనా జబర్దస్త్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి రోజా జబర్దస్త్ ను కంటిన్యూ చేస్తుందో లేదో. మరి జబర్దస్త్ లో మీనా ఉంటె బెటరా లేక రోజానే బెటరా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.