త్వరలో రేణూ దేశాయ్ తెలుగు సినిమా..!

71

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల తన కాబోయే భర్తతో నిశ్చితార్దం చేసుకొని తన జీవితంలో మరో అడుగు ముందుకేసింది…అయితే రేణూ దేశాయ్ త్వరలోనే ఒక స్ట్రైట్ తెలుగు సినిమాను రూపొందించబోతున్నానని తెలియజేసింది..గతంలో రేణూ తెలుగులో పవన్ సరసన బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే…

కాగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల ఆధారంగా ఓ స్క్రిప్ట్ రాశానని చెప్పారు. త్వరలోనే ఆమె ఒక గ్రామానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు వాళ్లతో గడిపి రైతుల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నే సమస్యలను అర్థం చేసుకోనున్నారట. ఇక ఈ చిత్రాన్ని స్వయంగా రేణు దేశాయ్ నే నిర్మించనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక గతంలో రేణుకు ఓ మరాఠీ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన అనుభవం ఉంది.