పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ… షాక్ లో కృష్ణవంశీ.

734

టాలీవుడ్, కోలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంది. ఇప్పటి వరకు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి, బాహుబలి2 లో శివగామిగా రమ్యకృష్ణ నటనకు ఎంతో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది రమ్యకృష్ణ. అయితే ఆమె ఇప్పటివరకు చెయ్యని ఒక పాత్రలో ఇప్పుడు నటిస్తుంది. మరి ఆ విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for ramya krishna

రమ్యకృష్ణ తాజాగా ఆమె త‌మిళ మూవీ సూప‌ర్ డీల‌క్స్ లో న‌టిస్తున్న‌ది. ఈ సినిమాకు త్యాగ‌రాజ‌న్ కుమార‌రాజా ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమా విశేషాలు వెల్లడిస్తూ..సూపర్ డీలక్స్ మూవీలో రమ్యకృష్ణ గతంలో పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో భాగంగా మల్లు కట్ అనే సినిమాలో శృంగారతారగా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు లీలా. ఈ పాత్ర కోసం తొలుత నదియాను సంప్రదించాం. కొన్ని కారణాల వల్ల ఈ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదు. నదియా రిజెక్ట్ చేశారనే విషయాన్ని పట్టించుకోలేదు. ఎలాంటి సందేహాలు లేకుండా పోర్న్ స్టార్‌గా నటించేందుకు రమ్యకృష్ణ ముందుకు వచ్చారు. చాలా కూల్‌గా తన పాత్రలో ఒదిగిపోయారు. నటిగా తనకు ఉన్న ఇమేజ్‌ను పక్కన పెట్టి ఈ పాత్రలో నటించడం నిజంగా అభినందనీయం అని దర్శకుడు అన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సూపర్ డీలక్స్ చిత్రంలో హీరో విజయ్ సేతుపతి ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారు. లింగమార్పిడి చేసుకొన్న మహిళగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. అలాగే ఈ చిత్రంలో సమంత, ఫహద్ ఫాజిల్ జంటగా నటిస్తున్నారు. మృతదేహాన్ని అమ్మడానికి తంటాలు పడే పాత్రల్లో నటించారు. చెన్నై నగరంలో 24 గంటల్లో జరిగే కథతో సూపర్ డీలక్స్ సినిమాను దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి పీసీ శ్రీరాం, పీఎస్ వినోద్, నీరవ్ షా సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. దర్శకుడు మిస్కిన్, గాయత్రి భాగవతి పెరుమాళ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. చూడాలి మరి రమ్యకృష్ణ ఈ పాత్రలో ఎలా ఒదిగిపోతారో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రమ్యకృష్ణ గురించి ఇప్పుడు పోర్న్ స్టార్ గా నటించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.