నటి ప్రియాంక ఆత్మ హత్య వెనుక అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

743

మనిషి రోజురోజుకు పిరికివాడిలా తయారవుతున్నాడు.ఏ చిన్న కష్టం వచ్చిన పోరాడకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాడు.ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.అయితే ఈ ఆత్మహత్యలలో సినిమా రంగానికి చెందినా వారు కూడా ఉండడం బాధాకరం.ఈ మద్య వరుసగా సినీ రంగానికి చెందినా వాళ్ళు చనిపోతున్నారు.ఇప్పుడు మరొక నటి చనిపోయింది.అయితే ఆమెకు మరియు రమ్యకృష్ణకు మద్య ఒక చిన్న సంబంధం ఉంది.మరి ఆ విషయాలు తెలుసుకుందామా.

Image result for actress priyanka

సినీనటి ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. చెన్నై వలసరవక్కాం లోని ఆమె ఇంటిలో పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. తమిళ్‌లో ‘వంశం’ లాంటి సక్సెస్‌ఫుల్‌ సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది.ఈ సీరియల్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటించింది.ఆ తరువాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక.తమిళులంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

Image result for actress priyanka

ప్రియాంక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.అయితే ఈమె మృతికి అనేక కారణాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.ఆ కారణాలు ఏమిటి అంటే…రెండేళ్ల కిందటే వివాహం చేసుకున్న ఆమె గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది.ఈ విషయం ప్రియాంక ఇంట్లో పని చేసే పనిమనిషి పోలీసులకు వెల్లడించింది.అయితే భర్తతో విడిపోడానికి ముఖ్య కారణం పెళ్లై రెండేళ్ళు అయినా ఇంతవరకు వాళ్ళకు పిల్లలు పుట్టలేదు.

Image result for actress priyanka

కారణం భార్యాభర్తల మద్య సఖ్యత  లేకపోవడం అంతేకాకుండా భర్తతో విడిపోయినా కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఆమెను తిట్టేవారంటా.ఒకవైపు భర్త దూరం అవ్వడం మరొకవైపు అమ్మానాన్నల వేదింపులు..మరొకవైపు తన బాధను అర్థం చేసుకునే వారు లేరని బాధ…ఇలా అనేకరకాల కారణాల వలన మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు.కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రియాంక మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈమె మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ నటులు అలాగే సీరియల్స్ నటులు తమ సంతాపాన్ని ప్రకటించింది.నడిగర్ సంఘం ఆమె మృతికి నివాళులు అర్పించింది.మరి మనం కూడా ఆమె మృతికి కామెంట్ రూపంలో నివాళులు అర్పిద్దాం.ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది.కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి.కాబట్టి వాటికి భయపడి అత్మహత్య లాంటి పనులు మాత్రం ఎవ్వరు చెయ్యకండి.మరీ ఈ నటి ఆత్మహత్య వెనుక ఉన్న విషయాల గురించి అలాగే ఇలా ఆత్మహత్య చేసుకునే వారి గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.