మీనా రియల్ స్టోరీ..

2819

అచ్చం మీనాల్లాంటి కళ్ళతో ముద్దులొలికే ముఖంతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది అందాల అభినేత్రి మీనా..కళ్ళతోనే భావాలను పలికించగలిగే అతికొద్దిమంది హీరోయిన్లలో మీనా ఒకరు..బాలనటిగా రంగప్రవేశం చేసి చిన్నా పెద్దా హీరోలతోనూ యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాదించుకుంది..మీనా దక్షిణాది భాషలన్నిటిలోనూ స్టార్ స్టాటస్ సంపాదించుకుంది.. జపాన్ లో కూడా మీనా కు అభిమానులున్నారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్దమవుతోంది..బాలంటిగా ప్రస్థానం మొదలు పెట్టిన మీనా స్వస్థలం చెన్నై..

Image result for meena

తండ్రి దురై రాజా తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందినవాడు..ఆయన గవర్న్‌మెంట్ టీచర్ కాగా తల్లి రాజమౌళిక సినీ నటి గాను రాజకీయ నాయకురాలిగాను తమిళనాడు ఎంతో గుర్తింపు సంపాదించుకుంది..సినీ నేపధ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో మీనా బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది..1982 లో నేంజంగల్ చిత్రంతో వెండితెర ప్రపంచంలో అడుగుపెట్టిన మీనా నవయుగం అనే తెలుగు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయింది..విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన కర్తవ్యం సినిమాలో మీనా కీలక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది.. సీతారామయ్యగారి మనవరాలు సినిమా ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి..

Image result for meena

అక్కడనుంచి మీనా వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసి కొద్ది కాలంలోనే స్టార్‌డం అందుకుంది..చంటి అల్లరి మొగుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళాం..ముఠా మేస్త్రి..బొబ్బిలి సింహం ముద్దుల మొగుడు సూర్యవంశం వంటి సూపర్ హిట్ చిత్రాలతో మీనా పేరు తెలుగునాట మార్మోగిపోయింది..ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళంలోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీనా..రజనికాంత్ విజయ కాంత్ కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసి తమిళ ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ సంపాదించుకుంది..మీనా భరత నాట్యం నేర్చుకుంది..అంతే కాదు ఆమె ఆరు భాషల్లో మాట్లాడగలదు..తెలుగు తమిళం,కన్నడ, మళయాళ హిందీ ఇంగ్లిష్ భాషల్లో ధిట్ట..

Related image

షూటింగ్ ల కారణంగా 8 వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన మీనా చాన్నాల్ల తరువాత 10 క్లాస్ పూర్తి చేసింది..ఇక ఆమె వివాహం పెద్దలు కుదిర్చిందే..వరుడు విద్యాసాగర బెంగుళూరులో సాఫ్త్‌వేర్ ఇంజినీర్..మీనా వివాహం 2009 లో తిరుమల లోని ఒక సత్రంలో ఘనంగా నిర్వహించారు..ఆ తరువాత చెన్నై లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు..మీనాకు నయనిక అనే కుమార్తె ఉంది..నయనిక కూడా తల్లి మీనా బాటలోనే బాల నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసింది..తమిళంలో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తోంది..

ఈ క్రింది వీడియో చూడండి

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తేరి చిత్రంలో హీరో విజయ్ కూతురిగా క్లనిపించింది నయనికే..ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్న మీనా కుమార్తె కెరీర్ ను తీర్చిదిద్దడంపై ప్రధానంగా దృష్టి సారించింది..మొన్నా మధ్య దృశ్యం సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించిన మీనా సాక్ష్యం అనే చిత్రంలోనూ నటిస్తోంది.. మీనాకు రోజా రంభ సంఘవి దేవయాని మంచి స్నేహితులు..కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీళ్ళు ఎక్కడున్నా కలుసుకుంటారట.. ముఖ్యంగా రోజాను ప్రాణ స్నేహితురాలిగా భావిస్తుంది మీనా..ఇటీవల మీనా కుమార్తె బర్త్ డే వేడుకలో రోజా చేసిన సందడి కోలీవుడ్ మీడియాలో హైలైట్ అయింది..మీనా రియల్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..