కూతురు కార్ డ్రైవర్ ని పెళ్లి చేసుకోవడం తో అవమానం తట్టుకోలేక కుప్పకూలిన ప్రముఖ టాప్ తెలుగు నటి

1108

కవిత ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. తమిళం, కన్నడ,మలయాళ భాషలలో 130 చిత్రాలలో నటించింది. ప్రస్తుతము కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రులో జన్మించింది. ఈవిడ ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. ఈమెకు ఆరేళ్లున్నప్పుడు మద్రాస్ కు మకాం మార్చారు. అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్ట పోయి, కుటుంబం రోడ్డున పడింది. ఒక్క పూట మాత్రం వీరికి తిండి పెట్టగలిగేవారు వీళ్ళ నాన్న. చదువులు చెప్పించే స్తోమత అసలే లేదు. దాంతో మద్రాసు లో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన కవితను చూసి… ‘చక్కగా ఉన్నావ్, సినిమాల్లో నటిస్తావా’ అనడిగారు. ఈవిడ ‘చదువుకోవాలీ అనేసి తిరస్కరించింది. కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్ కు హాజరైనది. అలా ‘ఓ మంజు ‘ అనే తమిళ సినిమాలో 11 ఏళ్ళ వయస్సులో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.

Image result for actress kavitha

ఓ మంజు అనే తమిళ చిత్రంలో కథానాయికగా 11 ఏళ్ళ వయసులో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో సిరిసిరిమువ్వ చిత్రంలో జయప్రదకు చెల్లెలి పాత్రలో మొదటగా నటించింది. పూర్తి స్థాయి కథానాయికగా ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ చిత్రంలో నటించింది.ఈవిడ కొంతకాలం తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించింది.ఆ తర్వాత విభేదాల వలన బిజెపి పార్టీలో జాయిన్ అయ్యింది. 1984 లో, 19 ఏళ్ళ వయస్సులో ఈవిడ వివాహం సింగపూర్ వ్యాపారవేత్త దశరథరాజ్ తో జరిగింది. వీరు చెన్నై లో మొదట తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఈవిడకు ముగ్గురు కుమార్తెలు సంతానము.అయితే ఈమె కూతురు ఒక కారు డ్రైవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కవిత ఇంట్లో కరీంనగర్ జిల్లా శంకరపట్నం కు చెందిన రాజ్‌కుమార్ మూడేళ్ల క్రితం నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కవిత కూతురు మాధురి తమ ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేసే రాజ్ కుమార్ ను ప్రేమించింది. ఎంబీఏ చదువుతున్న మాధురిని రాజ్ కుమార్ కారులో కాలేజీకి తీసుకువెళ్లున్న సమయంలో సాన్నిహిత్యం పెరిగి ప్రేమ మొదలైంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయం ఇంట్లో తెలిసిస్తే పెళ్లికి అంగీకరించరన్న ఉద్దేశ్యంతో మాధురి, రాజ్ కుమార్ సొంత ఊరు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని ఆలయంలో రహస్యంగా పెళ్లిచేసుకున్నారు.ఈ విషయంలోనే కవిత కుప్పకూలిపోయింది. చదువుకుని ఇలా తప్పుడు పని చేసిందని ఆమె వాపోయింది. ఆ తర్వాత కవిత చాలా కష్టాలు పడింది. ఇక కవిత రెండవ కూతురు కవిత చూసిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉంది.ఇక మూడవ కూతురు పెళ్ళికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కవిత జీవితం బాగానే ఉన్నా ఆమె మనసులో బాధ మాత్రం అలాగే ఉంది. ఆమె ఆ విషాదం నుంచి బయటపడి సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరి కవిత గురించి ఆమె నట జీవితం పర్సనల్ జీవితం అలాగే కూతురు చేసిన పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.