నటి ఝాన్సీ ఆత్మహత్య వెనుక ఎన్నో అనుమానాలు….పోలీసులకు షాకింగ్ నిజాలు చెప్పిన ప్రియుడు!

328

వర్ధమాన టీవీ తార ఝాన్సీ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని, సూర్య అలియాస్ నాని అనే యువకుడు మోసం చేసినట్టు ఆమె తండ్రి వెల్లడించాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆత్మహత్యకు ముందు సూర్యతో వాట్సాప్‌లో ఝాన్సీ చాటింగ్ చేయడమే కాదు, వారిద్దరూ కలుసుకున్నారని, ఆపైనే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధరించారు. సూర్యతో మంగళవారం ఉదయం ఝాన్సీ, సూర్యల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలియడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Image result for actress jhansiఅయితే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదని, తనను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను అయితే కొంత సమయం కావాలని అడిగా, అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు వెంటనే పెళ్లి చేసుకో అని తాను నన్ను బలవంతం పెట్టింది. ఇంట్లో వేరే పెళ్లి చేస్తారని తాను నాకు చెప్పిందని నాని పోలీసులకు చెప్పాడు.ఘటనా స్థలిలో ఝాన్సీ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని లాక్‌ను తీయడానికి సైబర్ నిపుణులను సంప్రదించారు. మరోవైపు, కుమార్తె ఆత్మహత్య విషయం తెలిసిన ఝాన్సీ తల్లి భోరున విలపిస్తున్నారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తనకు తెలియదని, కొద్ది రోజుల నుంచి చిరాగ్గా ఉందని చెప్పి షూటింగ్‌‌కు కూడా వెళ్లడంలేదని ఆమె తెలియజేశారు. అంతేకాదు, సూర్య అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. మంగళవారం రాత్రి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడిందని ఆ సమయంతో ఆమెతో పాటు తన కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే, ఝాన్సీ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, సీరియల్‌ అవకాశాలు కోల్పోయి, మరోవైపు సూర్య మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ఇక ఝాన్సీ సూర్యతో సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది. పది రోజుల కిందటే ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఝాన్సీ చెప్పిందని కుటుంబసభ్యులు అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులే చంపేసి నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే నానిని ఝాన్సీ ప్రేమించడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు చూడాలి. గాంధీ హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్య కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈమె మరణవార్త విన్న తోటి నటీనటులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఝాన్సీ గురించి అలాగే ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాల గురించి అలాగే ఆత్మహత్య వెనుక ఉన్న అనుమానాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.