‘అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ’గా ఇలియానా..

284

‘చిత్ర పరిశ్రమకు, సెలబ్రిటీల‌కు క్రేజ్ ఎక్కువ. నిజాయతీగా ఉండే అభిమానులు తమకు ఇష్టమైన నటుడు, నటికి సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు.అందుకే ఇంటర్ నెట్ లో వాళ్లకు సంబందించిన అన్ని విషయాలను ఉంచుతారు.అయితే కొందరు మాత్రం దీనిని తప్పుగా వాడుకుంటారు.

Image result for ileana d'cruz

దీన్ని సైబర్‌ నేరస్థులు అదునుగా తీసుకుంటారు. తప్పుడు ఐడీలు పెట్టి సమాచారం దొంగలించేందుకు ప్రయత్నిస్తుంటారు.అలా వెతికిన వారిలో ఇప్పుడు ఇలియానా నెంబర్ 1 స్థానం సంపాదించింది.‘అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ’గా నిలిచారు. ఇప్పటి వరకు ఇండియన్‌ సైబర్‌స్పేస్‌లో ఈ జాబితాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్‌ శర్మ మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఇలియానా నిలిచారు.

Image result for iliana

అమెరికన్‌ గ్లోబల్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ McAfee నిర్వహించిన ‘అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ’ సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్లను మభ్యపెట్టి తప్పుడు వెబ్‌సైట్లు క్లిక్‌ చేసేందుకు ఇలియానా పేరును ఎక్కువగా ఉపయోగించారని తేలింది. ఈ జాబితాలో ఆమె తర్వాత ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ప్రీతీ జింతా, టబు, కృతి సనన్‌, అక్షయ్‌ కుమార్‌, రిషి కపూర్‌, పరిణీతి చోప్రా, గోవింద ఉన్నారు.