త్రివిక్రమ్‌‌ను చూస్తే నాకు కడుపు మంట… అందుకే అలా చేశా… నటి హేమ

300

“ఏమండీ హేమ గారు వరుసగా త్రివిక్రమ్ సినిమాల్లో చేశారు కదా? ఇప్పుడు ఏమైంది?” అని అడిగితే తన రెమ్యూనరేషన్ విషయంలో త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఆయన సినిమాల నుండి తాను తప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ‘అసలు నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి త్రివిక్రమ్ ఎవరు? సినిమా అంటే దానికో ప్రొడ్యుసర్ ఉంటారు. మేనేజర్ ఉంటారు. వాళ్లు మాట్లాడతారు. ఒకవేళ నాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతే.. అమ్మా మేం అంత ఇవ్వలేం.. ఇష్టమైతే చేయండి.. కష్టమైతే మానేయండి అని చెప్తారు. మధ్యలో ఈయనకు సంబంధం ఏంటి?

Image result for trivikram

ఇన్ని సంవత్సరాలు త్రివిక్రమ్‌తో ట్రావెల్ చేసినా ఆయనకు నా మాట మీద నమ్మకం లేదు. అందుకే కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయా. నా ఇగోని హర్ట్ చేయడం వల్ల ఆయనతో మాట్లాడటం మానేశా. ఫోన్ చేయడం మానేశా. ఆయన ఎదురుపడినా పలకరించేదాన్ని కాదు. నాకు అంతలా మండేలా చేశారు. కడుపు మంటతో చెబుతున్నా’ అంటూ త్రివిక్రమ్‌తో ఉన్న వివాదాన్ని బయటపెట్టారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఏదైనా సినిమాలో హీరోహీరోయిన్లు దర్శకుల కోసం వంద టిక్కెట్లు వస్తే నాలాంటి వారి కోసం పది పదిహేను టిక్కెట్లైనా వస్తాయని చెప్పారు హేమ‌, ఇక ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాద్ మ‌బ్బుల వెనుక సూర్యుడిలా ఉన్నాడు ఆయ‌న మ‌బ్బులు తొలిగిపోతే సూర్యుడిగ‌గా బ‌య‌ట‌కు వ‌స్తాడు అని చెప్పింది హేమ‌, మ‌రి పూరిపై త్రివిక్ర‌మ్ పై చేసిన కామెంట్లు ఎటువంటి స‌మాధానాలు ఇస్తాయో చూడాలి.