న‌టుడు ప్రకాశ్‌రాజ్ ఆస్తి ఎన్నివేల కోట్లో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

384

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ తనకున్న ఆస్తుల విలువను ప్రకటించారు. నామినేషన్‌తోపాటు సమర్పించిన ఆస్తుల వివరాలలో తనకు రూ.26.59 కోట్ల స్థిరాస్తులు, రూ.4.93 కోట్ల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడాది సిని మాల ద్వారా రూ.2.40కోట్ల ఆదాయం లభించిందన్నారు. వివిధ బ్యాంకులలో రూ.25వేల నగదుతోపాటు పెట్టుబడుల రూపంలో రూ.2.94 కోట్లు ఉన్నాయని అలాగే రూ.1.88 కోట్ల విలువ చేసే వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య రష్మివర్మ పేరిట 20.46లక్షల చరాస్తి, రూ.35.లక్షల స్థిరాస్తి, రూ.18లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నాయన్నారు. చిక్కమంగళూరులో శాంతికి భంగం కలిగించారనే ఆరోపణతో తనపై కేసు దాఖలైందని కూడా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు న‌టుడు ప్ర‌కాష్ రాజు సినిమాల‌తో బీజీగా ఉంటూనే రాజ‌కీయాల్లో కూడా ఎంట‌ర్ అయ్యారు, ఈ రెండు నెల‌ల్లో ఆయ‌న ఎలాంటి రాజ‌కీయ ప‌ద‌వి సంపాదిస్తారో చూడాలి అంటున్నారు అక్క‌డ జ‌నం.

బెంగళూరు సెంట్రల్‌ బీజేపీ అభ్యర్థిగా ఉన్న పి.సి. మోహన్‌ తనవద్ద మొత్తం 36.4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. వీటిలో రూ.17.28 కోట్లు స్థిరాస్తి కాగా 18.76 కోట్లు చరాస్తిగా ఉంది. అలాగే రూ.15.9 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని తెలియ‌చేశారు. తన సతీమణి శైలా మోహన్‌ పేరిట వాణిజ్యకట్టడా లు, నివాస గృహం ఉన్నాయని వీటి మొత్తం విలువ రూ.18 కోట్లు అని పేర్కొన్నారు. తన భార్య పేరిట కూడా అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు.

Image result for prakas raju

తాత దేవేగౌడ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజ్వల్‌ రేవణ్ణ తన పేరిట రూ.9.78 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో 15.58 లక్షల నగదు, కిలో బంగారు ఆభరణాలు, 23 కిలోల వెండి ఆభరణాలు, రూ.4.5 లక్షల విలువ చేసే 18 ఆవులు, రూ.30వేల విలువ చేసే 2 ఎద్దులు ఉన్నాయన్నారు. తనకు 3.72 కోట్ల అప్పుల భారం కూడా ఉందని ప్రస్తావించారు. తండ్రి రేవణ్ణ నుంచి రూ.1.26 కోట్లు, తల్లి భవానీ నుంచి రూ.43.75 లక్షలు, అత్త అనసూయ నుంచి రూ.22లక్షలు అప్పు పొందానన్నారు.శోభాకరంద్లాజే ఆస్తులు రూ.10.48 కోట్లు. మ‌రి కన్నడ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి ఇటు రాజ‌కీయ ఉద్దండుల కుటుంబాల నుంచి యువ‌త‌రం ఈసారి లోక్ స‌భ బ‌రిలో ఉంటున్నారు మ‌రి చూడాలి వీరిని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.