Breaking News :మోహ‌న్ బాబు ఇంట్లో విషాదం కుప్ప‌కూలిపోయిన మోహ‌న్ బాబు

488

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది… మోహన్‌బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో గురువారం ఉదయం ఆరు గంటలకు మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

actor mohan babus mother manchu laxmamma dies at tirupathi
85 ఏళ్ళ ఈమె, ప్రస్తుతం తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ లో ఉంటుండగా, నేడు ఉదయం 6 గంటలకు అక్కడే తుది శ్వాస విడిచారు అని తెలుస్తోంది. మోహన్ బాబు కుటుంబం అంతా ప్రస్తుతం విదేశాల్లో ఉంది, ఈవిష‌యం తెలియ‌గానే మోహ‌న్ బాబు క‌న్నీరు మున్నీరు అయ్యారు.. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి. లక్ష్మమ్మ మోహ‌న్ బాబు త‌ల్లిగా ఇండ‌స్ట్రీలో అంద‌రికి సుప‌రిచితులు, ఇక ఆమెమ‌ర‌ణ వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు ఆమెతో ఉన్న సంబంధాల‌ను షేర్ చేసుకుంటున్నారు.. ఇటు చిరంజీవి, రాజేంద్ర‌ప్ర‌సాద్ బ్ర‌హ్మానందం ఇలా ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఆయ‌న మాతృమూర్తి సుప‌రిచితులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మంచు మోహ‌న్ బాబుకు ఆమె వెన్నంటి ఉన్నారు, సినిమా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న స‌మ‌యంలో ఆమె మోహ‌న్ బాబుకు స‌పోర్ట్ గా నిలిచారు, ఇంటి నుంచి మోహ‌న్ బాబుకు త‌ల్లి ల‌క్ష్మ‌మ్మ ఎంతో స‌పోర్ట్ గా ఉన్నారు, ఆమె త‌ల్లి పై ప్రేమ‌తో కుమార్తెకు కూడా ఆమె త‌ల్లి పేరును పెట్టారు మోహ‌న్ బాబు, ఇక ఆయ‌న ఇంట్లో ఏ వేడుక జ‌రిగినా ముందు ఆమె మాతృమూర్తి ఉంటారు, ఇలా ఆమెను ఎంతో ప్రేమ‌గా చూసుకున్నారు మోహ‌న్ బాబు, ఇక నేడు ఆమె మ‌ర‌ణించింది అని తెలియ‌డంతో ఆయ‌న శోక‌సంద్రంలో మునిగిపోయారు, ఇటు ఆయ‌న కుమారులు కోడ‌ళ్లు కూతురు అల్లుడు అంద‌రూ తిరుప‌తి బ‌యలుదేరారు, ఇక ఒక్కొక్క‌రుగా ప్ర‌ముఖులు కూడా మోహ‌న్ బాబు ఇంటికి చేరుకుంటున్నారు, ఆమె ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌నం కూడా కోరుకుందాం, ఆమెకు సంతాపంగా మీ కామెంట్లు తెలియ‌చేయండి.