దేవదాస్ కనకాల రియల్ స్టోరీ

88

మనం సినిమా హీరోలకు అభిమానులం, అయితే ఆ సినిమా హీరోలను తీర్చిదిద్దిన గురువులను కూడా గుర్తు తెచ్చుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకి ఎదిగానా, గురువుగారు అంటూ సౌత్ ఇండియా సూపర్ స్టార్స్, అలాగే మెగా స్టార్లు ఇద్దరూ కూడా ఆప్యాయంగా పలకరించే మనిషి ఆయన.. తనలోని నటనను పదిమందికి పంచి వారిని వెండితెరపై అగ్రహీరోలుగా తయారు చేసిన శిల్పి అనే చెప్పాలి. నిగర్శి సౌమ్యుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు నటుడు నట శిక్షకులు అయిన దేవదాస్ కనకాల. సినిమా ప్రపంచంలో ఆయన ఎక్కడ కనిపించినా అందరూ ఆప్యాయంగా గురువుగారు అని పిలుస్తారు. అంతటి గొప్ప వ్యక్తి దేవదాస్ కనకాల, అలాంటి ఓ గొప్ప సినిమా గురువు గురించి మనం ఈరోజు రియల్ స్టోరీలో తెలుసుకుందాం.

Image result for దేవదాస్ కనకాల

దేవదాస్ కనకాల జూలై 30, 1945 తూర్పుగోదావరి జిల్లా యానాంలో జన్మించారు. . దేవదాసు సొంత ఊరు యానాం శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా చేసారు. ఆయన తల్లి మహలక్షమమ్మ. మొత్తం ఏడుగురు సంతానంలో దేవదాస్ కనకాల మొదటివ్యక్తి. స్కూల్ విద్య అంతా సొంత గ్రామంలోనే జరిగింది. తర్వాత విశాఖపట్టణం లోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు.
పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరుఅని చెప్పాలి అది ఆయన తొలి రికార్డ్.

Image result for దేవదాస్ కనకాల

1971 నవంబరు 21న లక్ష్మీదేవి కనకాల తో దేవదాస్ కనకాల ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు (రాజీవ్ కనకాల), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. ఆయన కుమారుడు రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ సుమ తో జరిగింది, అలాగే కుమార్తె శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావు తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.
కులాలు మతాలు పట్టింపులకు ఆయన చాలా దూరంగానే ఉండేవారు.

Image result for దేవదాస్ కనకాల

సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. సినిమాలు అంటే ఎంతో ఇష్టంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఓ సీత కథ లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా చలిచీమలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపోర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

Image result for దేవదాస్ కనకాల

రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే. దూరదర్శన్ కోసం వీరు దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది మొదలగు సీరియల్స్ విశేష ప్రజాధరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దుతున్నారు.

Image result for దేవదాస్ కనకాల

ఆయనకు అన్నీ సినిమాల్లో మంచి పాత్రలే వచ్చాయి.
ఇదీ సంగతి
ఒక్క మగాడు
మీ ఆయన జాగ్రత్త
చెట్టు కింద ప్లీడర్
సిరిసిరిమువ్వ
అదృష్టవంతురాలు
జరుగుతున్న కథ
ఈ కాలపు పిల్లలు
మాంగల్యానికి మరో ముడి
ఓ సీత కథ
కాలం మారింది
గ్యాంగ్ లీడర్
గోరింటాకు
బుద్ధిమంతుడు
మంచుపల్లకి
మనసంతా నువ్వే
కింగ్
అమ్మో ఒకటో తారీఖు
మల్లీశ్వరీ
శ్రీరామ్
పెదబాబు
జోష్
అసాధ్యుడు సినిమాల్లో నటించారు

ఈ క్రింద వీడియో చూడండి

చివరగా భరత్‌ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. అంతేకాదు అమ్రతం సీరియల్ లో కూడా ఆయన నటించారు ఇది టెలివిజన్ లో ఓ మంచి హిట్ అనే చెప్పాలి. నటనతో పాటు ఆయనకు దర్శకత్వం కూడా వచ్చు. చలిచీమలు అనే సినిమాకు దర్శకత్వం వహించారు….ఆయన కుమారుడు రాజీవ్‌ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇటీవల దేవదాస్‌ సతీమణి మృతిచెందడం ఆయనను ఎంతో కలిచివేసింది. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురవ్వడంతో ఇటీవల ఆయనను కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 2-2019న ఆయన మరణించారు.దేవదాస్‌ కనకాల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఎంతో మంది నటులను నటనలో ఓనమాలు దిద్దించిన గొప్ప వ్యక్తి దేవదాస్‌, ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంతోమందిని పరిచయం చేసిన గురువుగానే ఆయన్ని స్మరించుకోవాలి. సౌత్ ఇండియాలో ఇంత మంది గొప్ప హీరోలను తయారు చేసి మనకు అందించిన ఆ గురువుగారికి ఘన నివాళి అర్పిద్దాం.