నటుడు బ్రహ్మాజీ భార్య ఎవరో తెలుసా..బయట ప్రపంచానికి తెలియని అనేక విషయాలు..

3281

హీరో అవ్వాలని ఆశతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటుడు బ్రహ్మాజీ..మొదట చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తరువాత ఒక లైం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..వేషాలు కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమయి ఇద్దరూ ఒకే రూంలో ఉంటూ కష్టాలు పడ్డారు..కృష్ణవంశీ తీసిన సీందూరం సినిమాలో హీరో అవకాశం దక్కించుకున్నా ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ క్యారక్టర్ రోల్స్ లో సెటిల్ అయిన బ్రహ్మాజీ నేడు ఉన్న పరిస్థితుల్లో హీరోలను మించిన నటుడు అనే చెప్పాలి..కానీ సిందూరం సినిమాలో బ్రహ్మాజీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు..సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ టాలివుడ్ లో స్థిరపడ్డాడు..అంతే కాదండోయ్ బ్రహ్మాజీ కామెడీ చేయడంలో తనదైన మార్కు సినిమాలను చేసాడనే చెప్పుకోవాలి..నిన్నే పెళ్ళాడుతా ఖడ్గం అతడు ఏక్ నిరంజన్ మిరపకాయ్ మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు పొందాడు..

చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా తన పాత్ర పరిధిని మాత్రమే చూసుకుంటూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలోనూ బ్రహ్మాజీ ఎప్పుడూ ముందుంటాడు..బ్రహ్మాజీ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు..తొలినాళ్ళలో పూట భొజనం చేయకుండా ఎంతో కష్టంగా ఉన్న సమయంలో తనకు మొదటి అవకాశం ఇచ్చిన కృష్ణ వంశీకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఎపుడూ చెప్తుంటాడు..అంతే కాదు కృష్ణ వంశీ తీసిన అన్ని సినిమాల్లో బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించాడు..తనకు కాస్త సమయంలో ఆదుకునే కృష్ణ వంశీ నుండి పెద్దగా రెమ్యూనరేషన్ ఆశించకుండా నటిస్తూ ఉంటాడు..తెలుగులోనే కాకుణ్డా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు..

ఈ క్రింద వీడియోని చూడండి

ఇక బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట..సినిమాలపై పిచ్చితో మద్రాస్ వెళ్ళి ఆ తరువాత నటుడిగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు..పెళ్ళయి ఒక కొడుకు ఉండి భర్తతో విడిపోయిన ఒక మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు..ఆమే పేరు శాస్వతి..కొడుకు పేరు సంజయ్..మొదట్లో అవకాశాలు కోసం కాస్త ఇబ్బంది పడుతున్న సమయంలో భార్య ఇచ్చిన మోరల్ సపోర్ట్ వలనే తాను ఈ స్థాయికి వచ్చానని బ్రహ్మాజీ అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు..తాను సినిమా కోసం కష్టపడుతుంటే కుటుంబం కోసం అన్నే తానై నడిపించింది శాశ్వతి..అంతే కాదు ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్ కూడా..ఇక తనకు సొంతంగా పిల్లలను కనకుండా సంజయ్ ను ఎంతో ప్రేమగా పెంచాడు..తనకు సొంతంగా పిల్లలు పుడితే సంజయ్ ను సరిగా చూసుకోనేమో అని సొంతంగా పిల్లలను కనలేదు..బ్రహ్మాజీ.. సంజయ్ కుమార్ కు పెళ్ళి జరిగి అది విడాకుల బాట పట్టింది..మొన్నా మధ్య ఫిలిం నగర్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసున సంజయ్ సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదంటాడు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..