కేరళ వరదల్లో ఇంటిని కోల్పోయి రోడ్డు పాలైన స్టార్ హీరోయిన్ ఇప్పుడెక్కడ ఉందో తెలుసా.?

524

కేర‌ళ వ‌ర‌ద‌ల్లో ఎందరో చిక్కుకున్నారు నీటికి ఏమి తెలుసు ధ‌నికులు పేద‌వారు అని మొత్తం అంద‌రిని ముంచేస్తుంది వ‌ర‌ద… అలాగే ఇక్క‌డ కూడా న‌లువైపులా అష్ట‌దిగ్బంద‌నం చేసిన‌ట్టు చేసింది. ఎటువైపూ క‌ద‌ల‌లేని స్దితి క‌ళ్ల‌ముందు కుటుంబ స‌భ్యులు కొట్టుకుపోతున్నా విషాద వ‌ద‌నంతో క‌న్నీరు పెట్టుకున్నారు…. ఇక ఆర్మీ – నేవీ- ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది వారిని ర‌క్షించి స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేశారు.. ముఖ్యంగా ప‌లువురి సినీ సెల‌బ్రెటీల ఇళ్లు అలాగే వారి ఫామ్ హౌస్ లు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నాయి..కొన్ని నేల‌మ‌ట్టం అయితే మ‌రికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.

Image result for kerala flood in anayanaఇక తాజాగా వ‌ర‌ద‌ల్లో నటి అనన్య కుటుంబం చిక్కుకుంది. తమిళంలో ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్, సీడన్‌ చిత్రాల్లో నటించిన నటి అనన్య. మలయాళ కుటుంబానికి చెందిన వ్య‌క్తి… ఈమె కేరళలోని కొచ్చిలో నివసిస్తోంది. కేరళా రాష్ట్రం 10 రోజులకుపైగా వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఎవరైనా కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతూ అర్థిస్తున్నారు. ఇప్పటికే ఎంతో ప్రాణనష్టం జరిగిపోయింది. అయినా ఇప్పటికీ వరణదేవుడు ఆ రాష్ట ప్రజలను కరుణించలేదు అనే చెప్పాలి. ఇక నటుడు జయరామ్‌ ఇల్లు నీట మునిగిపోవడంతో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

Image result for kerala flood in anayana
మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. అదేవిధంగా కొచ్చిలోని నటి అనన్య ఇల్లు నీట మునిగిపోయింది. దీని గురించి ఆమె వాట్సాప్‌లో ఒక ఫొటోను విడుదల చేస్తూ తన ఇల్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోయిందని తెలిపింది. కుటుంబ సభ్యులమంతా చాలా భయభ్రాంతులకుగురయ్యామని, గత శుక్రవారం సురక్షితంగా బయటపడ్డామని పేర్కొంది. ప్రస్తుతం పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తల దాచుకుంటున్నామని చెప్పింది. ఆ స‌మ‌యంలో చీక‌టిలోనే రెండు రోజులు ఉన్నామ‌ని తిన‌డానికి స‌రైన తిండి కూడా లేదు అని తెలియ‌చేసింది త‌మ‌తో పాటు చాలా మంది ఇళ్ల‌పై కూర్చున్నార‌ని, సాయం కోసం ఎదురుచూశామ‌ని క‌నీసం తాగ‌డానికి నీరు కూడా లేకుండా ఇబ్బంది ప‌డ్డామ‌ని అన‌న్య తెలియ‌చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తమ లాగే ఏందరో వరదల్లో చిక్కుకుని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని, సహాయకులు ముందుకొచ్చి వారందరిని రక్షించాలని పేర్కొంది. అదేవిధంగా మలయాళ సీనియర్‌ నటుడు సలీమ్‌కుమార్‌ తన కుటుంబంతో పాటు చుట్టు పక్కల వారు 50 మంది తన ఇంటిపై భాగంలో ఉంటూ సహాయార్థం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా చాలా మంది తమను రక్షించాలంటూ ఫోన్లు, వాట్సాప్‌లు వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుంటున్నారు. ఇక అన‌న్య కుటుంబాన్ని ముందు ఇక్క‌డ నుంచి వెళ్లిపోమ‌ని తెలియ‌చేశార‌ట.. త‌ర్వాత వ‌ర‌ద క్ర‌మక్ర‌మంగా పెర‌గ‌డంతో, ఆమె కుటుంబం బ‌య‌టకు రానంత వ‌ర‌ద‌ల్లో ఉండిపోయింది అని తెలుస్తోంది… ఇక ఆమెకు ఈ ఇంటి ప‌క్క‌న ఉన్న మ‌రో ఇళ్లు కూడా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో కూలిపోయింది అని తెలుస్తోంది. మ‌రోప‌క్క మ‌మ్ముట్టి మోహ‌న్ లాల్ కు సంబంధించిన ఫామ్ హౌస్ లు కూడా వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని దెబ్బ‌తిన్నాయి.. ఈ వ‌ర‌దలు మాత్రం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్నినింప‌డ‌మే కాదు వారికి ఎంతో మ‌నోవేధ‌న‌ను మిగిల్చాయి అని చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.