యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ సినిమా కురుక్షేత్రం

439

యాక్షన్ కింగ్ అర్జున్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు.

Kurukshetram: Action King Arjuns 150th movie

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ఈ చిత్రానికి సాయికృష్ణ పెండ్యాల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.మ‌లయాళంలో మోహ‌న్ లాల్ లాంటి స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్య‌నాథ‌న్ కురుక్షేత్రం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Related image

నిర్మాతలు మాట్లాడుతూ మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు రీసెంట్ గా నటించిన “నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా”, “అభిమ‌న్యుడు” సినిమాల‌తో ఈ తరం ప్రేక్షకులకు మరింత ద‌గ్గ‌ర‌య్యాడు. మళ్లీ కురుక్షేత్రం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆయన కెరీర్‌లో 150వ చిత్రం కావడం విశేషం.ఇప్పటికే నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ మూవీ లో యాక్ష‌న్ కింగ్ అర్జున్‌తో పాటు ప్ర‌స‌న్న‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, సుమ‌న్, సుహాసిని, వైభ‌వ్, శ్రుతి హారి హార‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.