భారతీయుడు2 లో అభిషేక్ బచ్చన్..

190

21 ఏళ్ల క్రితం విడుద‌లై తెలుగు, త‌మిళనాట బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం ‘భారతీయుడు’. ‘అవినీతి, లంచగొండితనం’లపై శంక‌ర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు అప్పట్లో ఓ హాట్ టాపిక్‌గా నిలిపింది. క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడుగా సినీ ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో అబ్బురపరిచాడు.

Image result for indian 2 poster

ఇప్పుడు ఇదే కాంబినేసన్‌లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియ‌న్ 2’ తెరకెక్కబోతోంది.ఇందులో కమల్ కు జోడిగా కాజల్ నటిస్తుంది.ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ‘భారతీయుడు-2’కి సంబంధించి ఓ వార్త ఆసక్తిగా మారింది.

Image result for indian 2 abhishek bacchan

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. శంకర్ పాత్ర గురించి చెప్పగానే జూనియర్ బచ్చన్ వెంటనే ఒప్పేసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీని మీద అధికారిక ప్రకటన రాలేదు.