సంచ‌ల‌న ట్వీట్ పెట్టిన అభిషేక్ బ‌చ్చ‌న్

397

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌తో, ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం క‌లుగుతోంది… ఎప్పుడు ఏ సెల‌బ్రెటీని ఎటువంటి వివాదాల్లోకి లాగుతారా అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు.. ముఖ్యంగా సెల‌బ్రెటీల పెళ్లిళ్ల‌పై వార్త‌లు రావ‌డం తెలిసిందే.. అలాగే ఇప్పుడు పెళ్లి అయిన వారి మ‌ధ్య గొడ‌వ‌లు జరుగుతున్నాయి, అంటూ కొత్త రూమ‌ర్లు స్ప్రెడ్ చేస్తున్నారు కొంద‌రు… ఇవి నిమిషాల్లో వైర‌ల్ అయి పెద్ద వివాదాలకు వారికి మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తున్నాయి.

Image result for abhishek bachchan

రీసెంట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ తనయుడు అభిషేక్ బచ్చన్‌, కోడలు ఐశ్వర్యరాయ్‌ల మధ్య జరిగిన గొడవ వలన రిలేషన్ చెడిందని , వారిద్దరు కలిసి ఉండడం లేదని తప్పుడు కథనాలు వచ్చాయి. దీనిపై తాజాగా అభిషేక్ ట్వీట్ చేశారు.. అస‌లు ఎటుంటింటి గొడ‌వ‌లు లేని త‌మ కుటుంబం పై ఇలా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించ‌డం ఏమిట‌ని రూమ‌ర్లు స్ప్రెడ్ చేయ‌డం పై అభిషేక్ ట్వీట్ల సంధించారు..

Image result for abhishek bachchan

ఇటీవల అభిషేక్ తన భార్య ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యతో కలిసి లండన్ వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత టూర్ ముగించుకొని ముంబై చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో వీరిని ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో బంధించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఓ ఫోటోలో ఆరాధ్య తన తండ్రికి దూరంగా , తల్లిని గట్టిగా పట్టుకొని ఉంది. ఐష్ కూడా జాగ్రత్తగా కూతురిని తీసుకొని నడుస్తున్నట్టు అనిపించింది.దీనిపై ఓ సైట్ వార్త‌ను ప్ర‌చురించింది.. వీరికి త‌గాదాలు జ‌రిగాయి అని వార్త‌ను రాసింది… దీంతో అభిషేక్ కాస్త బాధ్య‌త‌గా విష‌యం తెలుసుకుని వాస్త‌వాలు వార్త‌లుగా రాయాలి అని అన్నారు.. మొత్తానికి మా ఇద్ద‌రి మ‌ధ్య ఎటువంటి గొడ‌వ‌లు లేవు అని చెప్ప‌క‌నే చెప్పాడు అభిషేక్.