అబ్దుల్ కలాం బయోపిక్…ఐరన్ మాన్ పాత్రలో ఏ స్టార్ హీరోనో తెలుసా?

413

ఇండియన్ సినీ పరిశ్రమలో కొంతకాలంగా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితాలపై సినిమాలు రాగా త్వరలో ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ జయలలిత బయోపిక్ లు రాబోతున్నాయి. తాజాగా మరొక బయోపిక్ రాబోతుంది.

Image result for abdul kalam biopic movie

ఐరన్ మాన్ గా పేరు పొందిన సైంటిస్ట్ భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం మీద సినిమా తీయబోతున్నారంట. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ బయోపిక్ ను నిర్మించబోతున్నారు. అబ్దుల్ కలాం పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వినగానే అనిల్ కపూర్ చాలా ఎగ్జైట్ అయ్యాడని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.

Image result for abdul kalam

 

రాజ్ చెంగప్ప రాసిన అబ్దుల్ కలాం బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నారు. నిరు పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలా దేశం గర్వించ దగ్గ సైంటిస్టుగా ఎలా ఎదిగారు, భారత దేశాన్ని అణుశక్తి దేశంగా మార్చడం వెనక ఆయన చేసిన కృషి ఏమిటి? లాంటివి ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉంది. అబ్దుల్ కలాం బాల్యం నుంచి సినిమా మొదలై ఆయన రాష్ట్రపతిగా ఎన్నికవ్వడంతో ముగిసేలా స్కిప్టు సిద్ధం చేశారని టాక్.