పరుగులు పెట్టిన హీరో హీరోయిన్ చిత్ర యూనిట్..ఎందుకో తెలిస్తే షాక్..

232

అబర్నతి, జివి ప్రకాష్ జంటగా జైల్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. వసంత బాలన్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్ని చెన్నైలోని కన్నంగి నగర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ఊహించని సంఘటన ఎదురైంది.

Image result for abarnathi gv prakash

చెన్నైలో నేరాలు, హత్యలు ఎక్కువగా జరిగే ప్రాంతం అది. హీరో, హీరోయిన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. రెండు గ్యాంగ్స్ వేటకొడవళ్లతో దాడి చేసుకుంటూ షూటింగ్ స్పాట్ వైపు పరుగులు తీశారు. దీనితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హీరో జివి ప్రకాష్, హీరోయిన్ అబర్నతి పరుగులు తీసినట్లు తెలుస్తోంది.దూరంగా వెళ్లి వీరిద్దరూ ఓ ఇంట్లో దాక్కున్నారు.

Related image

చిత్ర యూనిట్ కూడా షూటింగ్ కు సంబందించిన వస్తువులన్నీ తీసుకుని పరుగులు పెట్టింది. దాదాపు 2 గంటల పాటు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగాకే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.