ఎన్టీఆర్ బ‌యోపిక్ లో లక్ష్మీ పార్వతి పాత్రలో టాప్ హీరోయిన్..

412

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా యన్.టి.ఆర్.తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ అంచనాలున్న సినిమాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు.

చాలా మంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ రానా లాంటి నటులు నటిస్తున్నారు.నారా చంద్రబాబునాయుడు పాత్ర కోసం రానాని, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం సుమంత్‌ని తీసుకున్న విష‌యం తెలిసిందే.అయితే ఇందులో లక్ష్మి పార్వతి పాత్రను ఎవరు చేస్తారా అని అందరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ పాత్ర కోసం ఒక సీనియ‌ర్ న‌టిని ఎంపిక చేశారు.ఆమె ఎవ‌రో కాదు ఆమ‌ని. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి స్థానం గురించి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయ‌ట‌. ఆ పాత్ర‌కు ఆమె క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని ఆమనిని సంప్రదించారట.తొలుత లక్ష్మీపార్వతి ప్రస్థావన ఉండదనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఆమనిని తీసుకున్నారనే వార్తలు రావడంతో క్రిష్ ఆ పాత్ర‌ను ఎలా చూపిస్తార‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. మరి దీనిపై లక్ష్మీపార్వతి ఏమయినా మాట్లాడుతారేమో చూడాలి.