నా జీవితంలో ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు.. ఆమని

397

నితిన్, రాశీ ఖన్నా జోడిగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియో వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా సాగింది. ‘శ్రీనివాస కళ్యాణం’ పాటల వేడుకకు హీరో హీరోయిన్లు పెళ్లి గెటప్‌లో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ ఆమని ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.‘నా లైఫ్‌లో ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. మళ్లీ చేస్తానో లేదో తెలియదు. ఈ సినిమాలో 70 మంది నటీనటులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.శ్రీనివాస కళ్యాణం చిత్ర యూనిట్ మొత్తం ఒక ఫ్యామిలీ జర్నీగా సాగింది.

ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ సమీర్ గారు 70 మందిని క్యాప్చర్ చేయడం గ్రేట్. ఇది సినిమాగా కాక పెళ్లి వేడుకలా ఎంతో ఎంజాయ్ చేశాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నారు ఆమని.