ఆదాశర్మ ఏంటి ఇలా అయ్యింది..కూరగాయలు అమ్ముతున్న ఆదాశర్మ..

456

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు కుర్ర‌కారుపై ఎటాక్ చేసిన ముద్దుగుమ్మ ఆధాశర్మ.ఈ సినిమాతో యూత్‌కు బాగా ద‌గ్గ‌రైంది.ఆ తరువాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’,’క్షణం’ వంటి సినిమాల్లో నటించింది. నటిగా మంచి పేరు దక్కించుకున్నప్పటికీ అదాకి సరైన హిట్లు మాత్రం రాకపోవడంతో అమ్మడు కనుమరుగైంది.టాలీవుడ్ లో లాభం లేదనుకుని తన మకాంను బాలీవుడ్‌కు షిప్ట్ చేసింది.

Image result for adah sharma selling

అక్కడ కూడా అమ్మడుకు కలిసిరాలేదు.గతేడాది బాలీవుడ్ లో ‘కమాండో 2’ సినిమాలో నటించినా అదాకు వర్కవుట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఫోటో షూట్లు, వీడియోలు అంటూ కాలం గడుపుతోన్న ఈ బ్యూటీ సడెన్ గా రోడ్ మీద కూరగాయలు అమ్ముకుంటూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.అసలు ఆమెను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

Image result for adah sharma selling

అదా అవతారం చూసిన వారు షాక్ అవుతున్నారు.అసలు ఆధాశర్మనేనా లేక ఎవరైనా ఆమెలాగే ఉన్న మరొక మహిళనా అని అనుకుంటున్నారు.ఓ హాలీవుడ్ సినిమా కోసం అదా ఈ లుక్ ని టెస్ట్ చేస్తోందని తెలిసింది.సినిమా కోసం అయితే ఆ మాత్రం కష్టపడాలిలెండి.ప్రస్తుతం అదా కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి..