ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులను భయపెడుతున్న రూమర్..

265

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం #RRR.ఈ చిత్రం మీద టాలీవుడ్ లోనే కాదు దేశం మొత్తం మీద భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఈ చిత్రం గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ న్యూస్ మాత్రం చరణ్, ఎన్టీఆర్ అభిమానులని కాస్త గందరగోళ పరిచే విధంగా ఉంది.ఆర్ఆర్ఆర్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండవ షెడ్యూల్ మొదలయ్యేది సంక్రాంతి తరువాతే అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

రాజమౌళి నెల పైగా గ్యాప్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ గురించి రూమర్స్ మొదలయ్యాయి.ఆర్ఆర్ఆర్ కథ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ తరువాత ఇంత గ్యాప్ తీసుకున్నాడని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా పూర్తి స్థాయిలో కథ సిద్ధం అయిన తరువాతే రాజమౌళి సెట్స్ పైకి వెళతాడు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది అనే చర్చ అభిమానుల్లో ఎక్కువవుతోంది.

దానయ్య నిర్మాణంలో

నెల గ్యాప్ తీసుకున్నాడంటే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం కావడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. దీనితో బాహుబలి తరహాలో ప్రభాస్ ఇరుక్కుపోయినట్లు ఎన్టీఆర్, రాంచరణ్ ఇరుక్కుపోవడం ఖాయం అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ పుకార్లపై కొందరు క్లారిటీ ఇస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం త్వరలో జరగనుంది. తనయుడి వివాహ ఏర్పాట్లు చేయడానికే రాజమౌళి ఏ గ్యాప్ తీసుకున్నారని అంటున్నారు.