అతనో లారీ క్లీనర్.. కానీ సినిమాల్లోకి ఎంటరయ్యి కోట్లు సంపాదించి ఇండస్ట్రీనే

1105

రాఘవ లారెన్స్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో బెస్ట్ డైరెక్టర్ లో ఒకరు. డైరెక్టర్ కాకముందు లారెన్స్ కొరియో గ్రాఫర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ప్రభుదేవా ట్రూప్ లో ఒకడిగా ఉంటూ.. అందరిని ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తూ మెగాస్టార్ కళ్ళల్లో పడ్డాడు. అంతే, మెగాస్టార్ హిట్లర్ సినిమాలో అవకాసం ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో కొరియోగ్రాఫర్ గా రాఘవా లారెన్స్ స్థిరపడిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే, లారెన్స్ కొరియోగ్రాఫర్ గా జీవితం ప్రారంభించే ముందు ఏం చేసేవాడో తెలిస్తే షాక్ అవుతారు. గతంలో దక్షిణాదిన సూపర్ ఫైట్ మాస్టర్స్ లో సూపర్ సుబ్బరాయన్ ఒకరు. ఆయన తన ఫైట్ సీన్స్ తో ఆకట్టుకునేవాడు. చిన్న వాళ్ళ దగ్గరి నుంచి అప్పటి పెద్దపెద్ద స్టార్స్ వరకు ఆయనే ఫైట్ కంపోజ్ చేసేవాడు.

Image result for raghava lawrence

ఆ సమయంలో లారెన్స్ ఆయన దగ్గర కారు క్లీనర్ గా పనికి కుదిరాడు. డ్యాన్స్ చేస్తూ కారు తుడుస్తుండేవాడు. అలా డ్యాన్స్ చేస్తూ కారు తుడుస్తుండగా ఆ దృశ్యం కోలీవుడ్ సూపర్ స్టార్ రాజినికాంత్ కంటపడింది.లారెన్స్ డ్యాన్స్ కు ముగ్దుడైన రజినీకాంత్ వెంటనే లారెన్స్ ను ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా ట్రూప్ లో జాయిన్ చేశాడు.

Image result for raghava lawrence

అలా చేరిన లారెన్స్ ప్రభుదేవా వద్ద మెలుకువలు నేర్చుకున్నాడు. ఆ ట్రూప్ లోనే బెస్ట్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు లారెన్స్. ముఠామేస్త్రిలో లారెన్స్ డ్యాన్స్ ను చూసి మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి అతనికి తన హిట్లర్ సినిమాలో అవకాసం ఇచ్చాడు.

Image result for raghava lawrence

ఆ సినిమాకు అద్బుతమైన కోరియోగ్రఫీ అందించాడు రాఘవ. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు లారెన్స్ కొరియోగ్రాఫి అందిస్తూ.. నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు రాఘవ. ఆ తనలోని టాలెంట్ ను బయటకు తీస్తూ మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వం వహించాడు.

Image result for raghava lawrence

టాలెంట్ ఉంటె దాన్ని ఆపడం ఎవరితరం కాదు. గాడ్ ఫాదర్ లేకపోయినా.. గాడ్ అండ ఉంటె చాలు.. ఎంత ఎత్తుకైన ఎదగవచ్చు అనడానికి లారెన్స్ జీవితమే ఒక ఉదాహరణ. కారు క్లీనర్ గా పనిచేసిన రాఘవ ఇప్పుడు పదుల సంఖ్యలో కార్లకు ఓనర్. అంతేకాదు.. తాను సంపాదించిన దాంట్లో నుంచి చాలా వరకు పేదలకోసం సహాయం చేస్తున్నాడు. సంపాదించిన సంపాదన దాచుకొని, ఇంకా ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో సంపాదించిన దాంట్లో చాలా వరకు సంపాదనను పేదలకోసం దానం చేయడం గొప్పవిషయం.