2.o సినిమా మీద రాజమౌళి షాకింగ్ కామెంట్స్

493

సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. బాహుబలి చిత్రంతో భారతీయ సినిమావైపు ప్రపంచం మొత్తం చూసింది. 2. 0 చిత్రంతో హాలీవుడ్ చిత్రాలని తలదన్నే ప్రయత్నం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు విజువల్ వండర్ కోసం ఎదురుచూస్తున్నారు. రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలో నటించారు. దానికి అప్డేటెడ్ వర్షన్ అంటూ ఈ చిత్రంలో చిట్టి పాత్రని కొనసాగించారు. అందాల బ్రిటిష్ సుందరి అమీజాక్సన్ హీరోయిన్ గా, రోబోగా నటించింది. ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది విలన్ పాత్ర. అక్షయ్ కుమారు వివిధ వికృత రూపాలలో కనిపిస్తూ ఆశ్చర్యపరిస్తున్నాడు.అయితే ఈ సినిమా మీద రాజమౌళి చేసిన ట్వీట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి జక్కన్న ఏమన్నాడో చూద్దామా.

Image result for rajamouli

దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 2.0 నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్స్ షోలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా రజనీకాంత్ అంభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక థియేటర్ వద్ద అయితే అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రధాన నగరాలలో ఇప్పటికే సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా 2.0 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న అద్భుతమైన దర్శకుల గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా శంకర్, రాజమౌళి గురించే మాట్లాడుకోవాలి. భారత చలన చిత్ర స్థాయిని పెంచే దిశగా వీరిద్దరూ సినిమాలు రూపొందిస్తున్నారు. తాజాగా రాజమౌళి 2.0 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. శంకర్ సర్ రూపొందించిన 2.0 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశా. ఎదురుచూపులు తెరదించుతూ నేడు సినిమా విడుదల కాబోతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ వివిధ రూపాలు చూడబోతున్నాం. 2.0 మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు అంటూ రాజమౌళి పేర్కొన్నారు.దీనికి నెటిజన్స్ మంచిగానే రిప్లైలు ఇస్తున్నారు.చూడాలి మరి అందరు ఎదురుచూస్తున్నట్టు సినిమా ఘనవిజయం సాధిస్తుందో లేదో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.2.ఓ సినిమా గురించి అలాగే జక్కన్న చేసిన ట్వీట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.