ఆన్ లైన్ బుకింగ్స్‌లో ‘2.o ’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

287

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.o మన ముందుకు వచ్చింది.శంకర్ మేకింగ్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది.రజనీకాంత్ అక్షయ్ కుమార్ అమీజాక్సన్ చిట్టి రోబో చేసి అద్భుతం గురించి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.సినిమా 2000 కోట్లను కలెక్ట్ చెయ్యడం పక్కా అని అంటున్నారు.

Related image

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. కాబట్టి 2000 కోట్లను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలింది బాక్సాఫీస్‌ రికార్డులను వేటాడమే. అయితే ఇప్పటికే కొన్ని రికార్డులను 2.ఓ సెట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన మీమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే పేటీఎమ్‌ ద్వారా 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు తెగాయని సమాచారం. ఇలా ఆన్‌లైన్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు తెగడం ‘2.ఓ’తోనే సాధ్యమైందని తలైవా అభిమానులు సంబరపడుతున్నారు.