హరికృష్ణ ఏక్సిడెంట్ తరువాత ఫోన్ చేసిన రాని 108 కారణం తెలిస్తే షాక్

440

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాల‌వ్వ‌డం తెలుగు ప్ర‌జ‌ల‌ను మ‌రింత షాక్ కు గురిచేసింది. కావ‌లిలో స్నేహితుడి కుమారుడి వివాహానికి వెళుతూ, ఆయ‌న రోడ్డు ప్రమాదంలో క‌న్నుమూశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆయ‌న్ని నార్కెట్ ప‌ల్లి కామినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. చివ‌ర‌కు 10 నిమిషాలు చికిత్స అందించినా ఆయ‌న క‌న్నుమూశారు…హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ, తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు..ఆయ‌న అంత్య‌క్రియ‌లు కూడా తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హప్ర‌స్ధానంలో అధికార‌కంగా, ప్ర‌భుత్వ లాంచ‌నాల‌తో చేసింది. ఆయ‌న మ‌ర‌ణం పై ఇప్పుడు ఓ కొత్త మాట వినిపిస్తోంది.

Image result for harikrishna nandamuri car accident imagesతెల్లవారు ఝామున 4.30కి బయలుదేరిన కారు నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా అన్నేపర్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, పోలీసులు స్పీడ్ మీట‌రు చూసి చెప్పారు… ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు,ఛాతీ భాగానికి బలమైన గాయాలు అయ్యాయి.. దీంతో శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడి మృతిచెందారు. ఎదురుగా వ‌స్తున్న‌వాహానం పై ప‌ల్టీకొట్టింది ఆయన కారు.

Image result for ambulance

అయితే ఆయ‌న‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే కారులో ఉన్న ఆయ‌న స్నేహితుడు కింద‌కి దిగిచూశారు.. హ‌రికృష్ణ‌ 30 అడుగుల దూరంలో ప‌డి ఉన్నారు.. ఆ స‌మ‌యంలో అటుగా వెళుతున్న వారు 108 వాహనానికి ఫోన్ చేసినా అందుబాటులో లేవు.. 20 నిమిషాల‌కు ఆయ‌న్ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.. ఆ స‌మ‌యంలో 108 వాహనం అందుబాటులో లేక‌పోవ‌డంతో, ఆయ‌నకు త‌క్ష‌ణ ట్రీట్మెంట్ అంద‌క మ‌రణించారు అని అంటున్నారు.

ఇప్పుడు ఇదే విష‌యం పై కూలంకుషంగా చ‌ర్చించుకుంటున్నారు అంద‌రూ.. ఓ నెల రోజులుగా 108 స‌ర్వీస్ ఉద్యోగులు విధులు బ‌హిష్క‌రించి స్ట్రైక్ చేస్తున్నారు.. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌జల ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి.. సెల‌బ్రెటీకే ఇటువంటి ప‌రిస్దితి వ‌చ్చింది అంటే, మాములు వ్య‌క్తుల‌ను ప్ర‌మాదాలు జ‌రిగితే అలా రోడ్లపైనే వ‌దిలేస్తారు అని అంటున్నారు… చూశారుగా మ‌రి ఇలా 108 ఉద్యోగులు విధుల్లో లేక‌పోవ‌డం స్ట్రైక్ వ‌ల్ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి.. ఇక నైనా వారి డిమాండ్లు ప‌రిష్క‌రించి, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడే వారి డిమాండ్లు తీర్చాలి అని అంటున్నారు సామాన్య జ‌నం… దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.