సాహో 9 వరోజు కలెక్షన్లు

57

సాహో ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్ వల్ల బాహుబలి-2 కి మించి మార్కెటింగ్ జరిగింది. ఆ హైప్‌తోనే ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు… అంతే కాదు బాహుబలి రెండు సినిమాలతో నార్త్ ఆడియన్స్ అంతా ప్రభాస్‌కి కనెక్ట్ అయిపోయారు.. అందుకే ఈ సినిమా అక్కడ కూడా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఓవరాల్‌గా సినిమా మొదటి మూడు రోజులకు గాను రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్ 8 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు.

Image result for sahoo

అయితే, మొదట మూడు రోజుల కలెక్షన్స్‌ని బేస్ చేసుకుని ఒక సినిమా ఫలితం ఏంటి అనేది చెప్పలేం. సాహోకి నాలుగో రోజు కూడా ఊహాతీతమయిన కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపించినప్పటికీ అవి మరీ అంత ఎక్కవగా లేవు. వినాయక చవితి సెలవు కూడా సాహోకి సానుకూలంగా మారింది.. ఆ పండుగ ఎఫెక్ట్‌తో సాహో టికెట్ కౌంటర్ కూడా పండుగ చేసుకుంది. దీంతో నాలుగు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో షేర్ 67 కోట్ల 35 లక్షల రూపాయలకు చేరింది. సాహోకు ఐదు ఆరోవ రోజు 40 కోట్ల షేర్ పెరిగింది. ఇక వారం రోజులు చేరేసరికి సాహో 520 కోట్ల మార్క్ చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సాహో ఏకంగా రూ.188 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి మిగిలిన రోజుల్లో ఆ అమౌంట్ రాబట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. సాహోకి అసలు టెస్ట్ ఇప్పుడే మొదలయ్యింది. భారీ రికార్డులు బద్దలు కొట్టే దిశగా వసూళ్లతో దూసుకు వెళుతోంది.. మరోవైపు, బాలీవుడ్‌లో వారం రోజులకు సాహో కలెక్షన్లు సునామి స్రుష్టించింది అని చెప్పాలి.

ఈ క్రింద వీడియో చూడండి

ఉత్తర అమెరికా, యూఏఈ, అమెరికా, లండన్ లో భారీగా సాహోకి కలెక్షన్లు వస్తున్నాయి.. ఇప్పటికే బాహుబలి 1 మార్క్ ని అమెరికాలో దాటేసింది సాహో.. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బిజినెస్ 188 కోట్లు అయితే ఒక వారం తిరిగే సరికి 220 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. ఇక 9వ రోజుకూడా షేర్ అదరగొట్టింది సాహో.. బాలీవుడ్ అడ్డా ముంబైలో మొత్తం 135 కోట్లు షేర్ రాబట్టింది.. తమిళ వెర్షన్ లో మొత్తం 48 కోట్లు వసూళ్లు వచ్చాయి. మళయాల వెర్షన్ లో 43 కోట్లు వచ్చాయి. మొత్తం కలెక్షన్లు చూస్తే 9 వ రోజుకి 662 కోట్లు వసూళు సాధించింది. తెలుగు వర్షన్ 200 కోట్లు వసూళ్లు చేసి సరికొత్త రికార్డు స్రుష్టించింది. బాహుబలి తర్వాత ఆ రికార్డు సాహో నమోదు చేసింది. దాదాపు వెయ్యి కోట్ల మార్క్ సాహో రీచ్ అవుతుంది అంటున్నారు ప్రభాస్ అభిమానులు.. చూడాలి ఇదే రన్ లో సాహో కలెక్షన్లు ఉంటే మరో వారంలో 1000 కోట్ల మార్క్ దాటవచ్చు అంటున్నారు సినీ క్రిటిక్స్ విశ్లేషకులు.