సాహో మూవీ చూసి ప్రభాస్ కు ఫోన్ చేసిన ఎన్టీఆర్..

72

తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ప్రభాస్ హీరో కాగా, రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు భాగాలు రికార్డులను తిరగరాసింది. అలాంటి బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. యువ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్. యూవీ క్రియేషన్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని సుమారుగా రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించారు. బాహ‌ుబ‌లితో ప్ర‌భాస్ రేంజ్ అంత‌ర్జాతీయ స్థాయికి చేర‌డంతో నిర్మాత‌లు సాహోను ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించారు. బాలీవుడ్ తార‌లు, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ఈ సినిమాకు ప‌నిచేయ‌డం, బాహుబ‌లి ఇమేజ్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చాయి.

Image result for ntr and prabhas

అయితే సినిమా జనాలను అంతలా ఆకట్టుకోలేకపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినెమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా చూసి సగటు ప్రేక్షకుడు చాలా నిరాశతో బయటకు వస్తున్నారు. సినిమాలో కథ లేదు కథనం సరిగ్గా లేదు.సినిమా మొత్తం యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. ఏమాత్రం ఎమోషన్స్ లేవని అభిమానులు బాధపడుతున్నారు. అయితే టోటల్ సినీ ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ సినిమా మీద ఉండడంతో సామాన్య ప్రేక్షకులే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను మొదటిరోజే చూశారు.ఈ సినిమాను ఎన్టీఆర్ కూడా చూసాడు. ప్రస్తుతం RRR షూటింగ్ లో భాగంగా బల్గెరియాలో ఉన్న ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి ఈ సినిమాని చూసినట్టు తెలుస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి

సాహో సినిమా చుసిన ఎన్టీఆర్ వెంటనే ప్రభాస్ కు ఫోన్ చేసి అభినందించాడు. డార్లింగ్ ఇప్పుడే సినిమా చూసా..సినిమా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ టేకింగ్ సూపర్ గా ఉన్నాయి. తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమాలాగ ఉంది. డైరెక్టర్ కొత్తవాడు అయినా కూడా ఈ రేంజ్ లో సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా తీశాడు. ఇక సినిమా నిర్మాతలు కూడా ఎక్కడ తగ్గకుండా ఖర్చు చేశారు. సినిమా చూస్తుంటే అదే ఫీలింగ్ కలుగుతుంది. సాంగ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఏది ఏమైనా బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా తీయడం గొప్ప విషయమే. సినిమా మేము ఊహించిన దాని కన్నా మంచిగా ఉంది. కంగ్రాట్స్ అంటూ ప్రభాస్ తన విషెస్ ను తెలియజేశాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ ఫోన్ చేసి అభినందించడంతో ప్రభాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, డైరెక్టర్స్ సాహో టీమ్ ను విష్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ సినిమా తీశారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, పలువురు దర్శకనిర్మాతలు ఈ సినిమాను చూసి టీమ్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి ప్రభాస్ కు ఫోన్ చేసి ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.