సాహో ఫ్లాప్ తో ప్రభాస్ సంచలన నిర్ణయం

40

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించింది. యువి క్రియేషన్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంతలా జనాలను ఆకట్టుకోలేకపోయింది. సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడం తో అందరూ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే నిర్మాతలు కూడా 350 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించిన సాహో పై అంచనాలని రెట్టింపు చేసారు. కానీ సినిమా అనుకున్నంతగా లేకపోవడం తో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

Image result for sahoo

సినిమాలో కావాల్సినంత యాక్షన్స్ ఎపిసోడ్స్ తప్ప కథలో కొత్తదనం , సరైన బలం లేకపోవడంతో థియేటర్లలో సాహో తేలిపోయింది. కనీసం హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీనితో సాహో రిజల్ట్ పై డార్లింగ్ ప్రభాస్ రియాక్ట్ అయ్యాడు. ప్రభాస్ మాట్లాడుతూ… అభిమానుల కోసమే బాహుబలి తరువాత రెండేళ్లు కష్టపడి ఈ సాహో సినిమాలో నటించాను. కానీ , ఫైనల్ గా మీకు ఈ సినిమా అంతగా నచ్చినట్టులేదు. ఏదేమైనా కూడా సాహో తో అభిమానుల అంచనాలను అందుకోకపోవడం చాల భాదగా ఉంది. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై నెగటివ్ టాక్ అనేది అసలు ఊహించలేదు. ఏదేమైనా కూడా లవ్ యు డార్లింగ్ …ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాతో అయినా కచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తా అని ప్రభాస్ తెలిపాడు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక భవిష్యత్ లో ఇంత భారీ బడ్జెట్ సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా హాలీవుడ్ టైపు లో ఉండే సినిమాలు ఎంచుకోకూడదని, కేవలం తక్కువ బడ్జెట్ సినిమాలు తీస్తూ, అది కూడా తెలుగులో మాత్రమే తీయాలని నిర్ణయించుకున్నాడట. అలాగే కొత్త డైరెక్టర్స్ తో తీసేటప్పుడు కథ విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని, తానూ చేసే తప్పు వలన వేరే వాళ్ళు నష్టపోకూడదని, అందుకే కథ సూపర్ గా ఉంటేనే సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాడంట. ఏది ఏమైనా ప్రభాస్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. చాలా తక్కువమంది హీరోలకే ఈ అవకాశం దక్కుతుంది. బాహుబలితో ప్రభాస్ కు ఆ ఇమేజ్ వచ్చింది. దీనిని కంటిన్యూ చెయ్యాలి కానీ ఇలా ఒక్క సినిమా ప్లాప్ అవ్వడంతో ఇలా పెద్ద సినిమాలు తీయను అని నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి సాహో రిజల్ట్ తర్వాత ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.