సాహో ప్లాప్ కు రాజమౌళి ఎంతవరకు కారణం ?

43

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సాహో’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయినా ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించింది. యువి క్రియేషన్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంతలా జనాలను ఆకట్టుకోలేకపోయింది. సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సాహో ప్లాప్ అవ్వడం వెనుక మన దర్శక ధీరుడు రాజమౌళి ఉన్నాడంట.

Image result for sahoo

రాజ‌మౌళి – ప్ర‌భాస్ మ‌ధ్య అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇండ్ర‌స్ట్రీలో ప్ర‌భాస్‌కి అతి ద‌గ్గ‌రైన వ్య‌క్తుల్లో రాజ‌మౌళి ఒక‌డు. బాహుబ‌లితో వీరిద్ద‌రి అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. బాహుబ‌లి త‌ర‌వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంలో స‌ల‌హాలు ఇచ్చింది కూడా రాజ‌మౌళినే. సాహో క‌థ విన్న వెంట‌నే నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌భాస్ సంప్ర‌దించిన వ్య‌క్తి కూడా రాజ‌మౌళినే. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వ‌చ్చింది కూడా జ‌క్క‌న్న‌నే. అంతేకాదు సాహో ఫైన‌ల్ వ‌ర్ష‌న్ చూసి ఓకే.. గో ఎహెడ్‌ అని ముద్ర వేసింది కూడా జ‌క్క‌న్నే అని టాక్‌. ఈ సినిమా లెంగ్త్ 3 గంట‌లు దాటేస్తే అందులోంచి పావుగంట కుదించింది కూడా జ‌క్క‌న్నేన‌ట‌. మొత్తానికి సాహో విష‌యంలో తెర వెనుక నుంచి రాజ‌మౌళి చేసిన స‌హాయం చాలానే ఉంది. సినిమా హిట్ట‌యితే.. ఈ విష‌యాన్నీ బ‌య‌ట‌కు వ‌చ్చేవి. కానీ ఫ‌లితం తేడా కొట్ట‌డంతో ఎవ్వ‌రూ చెప్పుకోవ‌డం లేదు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే సాహో ప్లాప్ అవ్వడానికి జక్కన సెంటిమెంట్ కూడా ఒక కారణం అని అందరు చెప్పుకుంటున్నారు. ఆ సెంటి మెంట్ ఏమిటంటే..రాజమౌళితో సినిమా తీసిన ఏ హీరోకు అయినా హిట్ రావడం పక్కా..కానీ ఆ హీరో నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతుంది.ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి బాహుబలి కి ముందు నాని ని ‘ఈగ’ గా మార్చిన సినిమా వరకు అలాగే జరిగింది. చరిత్ర చూసుకుంటే ఎన్టీఆర్ కు స్టూడెంట్ నెం1 తరువాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, నితిన్ కు సై తర్వాత అల్లరి బుల్లోడు, రామ్ చరణ్ కు మగధీర తర్వాత ఆరెంజ్, రవితేజకి విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్, మళ్లీ ఎన్టీఆర్ కే యమదొంగ తర్వాత కంత్రి, సునీల్ కు మర్యాదరామన్న తర్వాత అప్పలరాజు, నానికి ఈగ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు…. ఇకపోతే మన ప్రభాస్ కే ఛత్రపతి తర్వాత పౌర్ణమి రూపంలో రాజమౌళి సినిమా చేసిన తర్వాత సినిమా అడ్రెస్ లేకుండా పోయాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ కొనసాగి సాహో ప్లాప్ అయ్యింది. క‌నీసం రాజ‌మౌళి కూడా సాహోపై ఒక్క ట్వీటూ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మరి సాహో ప్లాప్ కు రాజమౌళి కారణం అవ్వడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.