సాహో పై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

58

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , శ్రద్దా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. యువ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్స్, ట్రైలర్స్ అన్ని కూడా అభిమానులని విపరీతంగా ఆకట్టుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు ఇంతలా క్రేజ్ రావడానికి ఒక కారణం డైరెక్టర్ రాజమౌళి అనే చెప్పుకోవాలి. ప్రభాస్ కు బాహుబలి లాంటి పెద్ద సినిమా ఇచ్చాడు కాబట్టే ప్రభాస్ కు హోల్ ఇండియా మొత్తం ఫాన్స్ ఏర్పడ్డారు. అందుకే సాహో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్రింద వీడియో చూడండి

తాజాగా ఈ సినిమా చూసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం RRR షూటింగ్ లో భాగంగా బల్గెరియాలో ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఈ సాహో సినిమాని చూసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ అంటే రాజమౌళి ఎనలేని అభిమానం అని అందరికి తెలిసిందే. ఆ కారణంతోనే హైదరాబాద్ లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఆ ఫంక్షన్ లో మాట్లాడుతూ ..ప్రభాస్ ఇప్పటికే ఆల్ ఇండియా స్టార్. అతడిని ఎంత ముందుకు తీసుకెళ్తే అంత వెళ్లాలి అంటూ ప్రభాస్ పై అభిమానాన్ని తెలిపాడు.

Image result for sahoo

ఇక సినిమా చూసిన తరువాత సాహో గురించి మాట్లాడుతూ … ఒక్క ముక్కలో చెప్పాలంటే బాహుబలి తరువాత ప్రభాస్ ని ఎలా చూడాలి అని అనుకున్నానో అచ్చం అలానే ఈ సినిమాలో ఉన్నాడని, నేషనల్ హీరో అనే ట్యాగ్ కి సూట్ అయ్యేలా తన నటనని రోజురోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాడని, సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్ గా ప్రభాస్ నటన అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. సినిమా మొత్తం ఎక్కడా ప్రభాస్ నటనలో తేడా రాకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో చేసిన విధానం కానీ చాలా బాగుంది అని తెలిపాడు. అలాగే డైరెక్టర్ సుజిత్ కి కంగ్రాట్స్ ..మేము ఇండస్ట్రీ వచ్చి ఎన్నో రోజుల తరువాత కానీ ఈ రేంజ్ హిట్ రాలేదు కానీ, సుజిత్ కెరియర్ మొదలుపెట్టిన తొలిరోజుల్లోనే ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు. అలాగే ఫైనల్ గా చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు. సాహో బాహుబలిని మైమరపించే సినిమా అని చెప్పుకొచ్చాడు. మరి సాహో సినిమా మీద రాజమౌళి చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.