సాహో డివైడ్ టాక్ పై స్పందించిన ప్రభాస్ ….సారీ డార్లింగ్స్

53

అంతర్జాతీయ స్థాయి సినిమా… ‘సాహో’ టీజర్‌, ట్రైలర్ చూశాక అందరినోట వినిపించిన మాట ఇది. ఆ రేంజ్‌లో తెరకెక్కిన సినిమా మరి. ‘బాహుబలి’ ప్రభాస్‌, బాలీవుడ్‌ దివా శ్రద్ధ కపూర్‌ ఓ పక్క భారీ తారాగణం, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి సినిమా ఆసక్తికరంగా రూపొందింది. అందుకే ‘ఇట్స్‌ షో టైమ్‌…’ అంటూ సాగిన టీజర్‌ వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విడుదల చేసిన ప్రతి లుక్‌, వీడియోలతో అది మరింత ఎక్కువైంది. సుమారు 350 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతలా జనాలను ఆకట్టుకోలేదు.

Image result for sahoo

బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడం తో అందరూ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే నిర్మాతలు కూడా 350 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించిన సాహో పై అంచనాలని రెట్టింపు చేసారు. దీనికి తోడు సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్ , టీజర్స్ అన్ని కుడా సినిమా హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా ఉండటంతో అంచనాలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా సాహో ని ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 10000 థియేటర్లలో భారీ రిలీజ్ చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ నే టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ సినిమా తోలి రోజు తోలి షో నుండే పూర్తి డివైడ్ టాక్ తో ఘోరమైన రివ్యూస్ ని పొందింది. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా సాహో కి ఏకిపారేసింది. సినిమా అనుకున్నంతగా లేకపోవడం తో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు, బాహుబలి తరువాత రెండేళ్లు కష్టపడి చేసిన సినిమా మరో ఇండస్ట్రీ హిట్ కొడుతోంది అనుకుంటే … బిగెస్ట్ డిజాస్టర్ దిశగా పోవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

సినిమాలో కావాల్సినంత యాక్షన్స్ ఎపిసోడ్స్ తప్ప కథలో కొత్తదనం , సరైన బలం లేకపోవడంతో థియేటర్లలో సాహో తేలిపోయింది. కనీసం హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీనితో సాహో రిజల్ట్ పై డార్లింగ్ ప్రభాస్ రియాక్ట్ అయ్యాడు. ప్రభాస్ మాట్లాడుతూ… అభిమానుల కోసమే బాహుబలి తరువాత రెండేళ్లు కష్టపడి ఈ సాహో సినిమాలో నటించాను. కానీ , ఫైనల్ గా మీకు ఈ సినిమా అంతగా నచ్చినట్టులేదు. ఏదేమైనా కూడా సాహో తో అభిమానుల అంచనాలను అందుకోకపోవడం చాల భాదగా ఉంది. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై నెగటివ్ టాక్ అనేది అసలు ఊహించలేదు. ఏదేమైనా కూడా లవ్ యు డార్లింగ్ …ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాతో అయినా కచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తా అని ప్రభాస్ తెలిపాడు. మరి సాహో రిజల్ట్ మీద ప్రభాస్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.