‘సాహో’ టాక్ బయటకు వచ్చేసింది… రాజమౌళిని తిట్టుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

109

దాదాపు 350 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘సాహో’ సినిమా భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద మొత్తంలో రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల స్క్రీన్లలో నేటి అర్ధరాత్రి నుండి షోలు వేసుకున్న ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మరియు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లను పెట్టి చేజింగ్ లు మరియు ఫైట్లు రూపొందించారు. కానీ ఆ సినిమా అందరి అంచనాలను అందుకోగలిగిందా? యూ.ఎస్ ప్రీమియర్ ల నుండి ఆంధ్ర థియేటర్లలో బెనిఫిట్ షో ల వరకు ఏం టాక్ నడుస్తోంది? అంటే యావరేజ్ టాక్ నడుస్తుంది అనే చెప్పుకోవాలి. ఎన్నో అంచలనతో వెళ్లిన ఫాన్స్ నిరాశతో వెనుతిరిగి వస్తున్నారు. అయితే సాహో యావరేజ్ టాక్ రావడంతో అందరు రాజమౌళి మీద పలు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఎందుకు వచ్చాడు?అని అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా ఆగండి.

Image result for sahoo

సాహో సినిమాకి రాజమౌళి సెంటిమెంటే గట్టిగా తగిలింది. ఇప్పటివరకు రాజమౌళి ఏ హీరోకి ఫ్లాప్ ఇచ్చింది లేదు. గట్టిగా మాట్లాడితే యావరేజ్ కూడా ఇవ్వలేదు. కానీ ఆయనతో సినిమా చేసిన హీరో తర్వాత చిత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి బాహుబలి కి ముందు నాని ని ‘ఈగ’ గా మార్చిన సినిమా వరకు అలాగే జరిగింది. ఇక బాహుబలి లాంటి పెద్ద సినిమా తర్వాత కూడా తమ హీరోకి డిజాస్టర్ సినిమా వస్తుందేమో అని ఫ్యాన్స్ భయపడిపోయారు. చివరికి మొదటి ఆట చూసిన వాళ్లంతా ఇదేం సినిమా అంటూ తలపట్టుకుని పెదవి విరుస్తున్నారు. రాజమౌళి సెంటిమెంట్ ఈ సినిమాకి ఎంత గట్టిగా పని చేసిందో ఇంతకుమించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ క్రింద వీడియో చూడండి

చరిత్ర చూసుకుంటే ఎన్టీఆర్ కు స్టూడెంట్ నెం1 తరువాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, నితిన్ కు సై తర్వాత అల్లరి బుల్లోడు, రామ్ చరణ్ కు మగధీర తర్వాత ఆరెంజ్, రవితేజకి విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్, మళ్లీ ఎన్టీఆర్ కే యమదొంగ తర్వాత కంత్రి, సునీల్ కు మర్యాదరామన్న తర్వాత అప్పలరాజు, నానికి ఈగ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు…. ఇకపోతే మన ప్రభాస్ కే ఛత్రపతి తర్వాత పౌర్ణమి రూపంలో రాజమౌళి సినిమా చేసిన తర్వాత సినిమా అడ్రెస్ లేకుండా పోయాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ కొనసాగి ‘సాహో’ కి సంబంధించి చాలా నెగిటివ్ టాక్ బయటకు వచ్చేసింది. కేవలం మూడు నాలుగు యాక్షన్ సీన్లు తప్పితే పాత కథకే మెరుగులు దిద్ది ప్రభాస్ స్టామినాను నమ్ముకొని అర్థంపర్థం లేకుండా సినిమా ఉందని మామూలు ఆడియన్స్ తో పాటు ప్రభాస్ అభిమానులే వాపోతున్నారు. మొత్తానికి అంచనాలు లేకుండా చూస్తే ఒక రకంగా ఉంటుందని వారు అంటున్నా 350 కోట్ల ఫ్యాన్ ఇండియా సినిమా పై అంచనాలు లేకుండా సినిమాకి ఎవరు పోతారు చెప్పండి. అయితే మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపంలో రాజమౌళి ఒకరికి కాకుండా ఇద్దరు స్టార్ హీరోలకి దెబ్బ వేయబోతున్నారు అన్నమాట. మరి సాహో డిజాస్టర్ కు రాజమౌళి కి మధ్య ఉన్న సంబంధం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.