సాహో టాక్ పై ప్రభాస్ పెద్దమ్మ సంచలన వ్యాఖ్యలు !

41

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో జోరు మీదున్న ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం చేశాడు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టోటల్ సినీ ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ సినిమా మీద ఉండడంతో సామాన్య ప్రేక్షకులే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను మొదటిరోజే చూశారు. ఇలాంటి పరిస్థితులలో నిన్న హైదరాబాద్ లోని ఒక మల్టీ ప్లెక్స్ ధియేటర్ లో ‘సాహో’ సినిమాను చూసి ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Image result for sahoo

‘సాహో’ మూవీ ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ బాగా నచ్చిందనీ విపరీతంగా తనకు మెసేజ్ లు వస్తున్నాయని ఇలాంటి సమయంలో ఈమూవీ పై ఎందుకు డివైడ్ టాక్ వచ్చింది అని ప్రచారం జరుగుతుందో తనకు అర్ధం కావడం లేదు. సినిమా చాలా బాగుంది. నాకైతే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా హాలీవుడ్ రేంజ్ లో ఉండే సినిమాలు మన తెలుగు ప్రేక్షకులకు అర్థం కావాలంటే కొంత సమయం పడుతుంది అంటూ ఆమె కామెంట్స్ చేసింది. అంతేకాదు ప్రభాస్ కోరుకుంటే జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఒక దర్శకుడుతో సినిమా చేయగల స్థాయి ఉందని అయితే ప్రభాస్ ఎప్పుడు పెద్ద దర్శకులతో సినిమాలు చేయకుండా ముఖ్యంగా కొత్తవారిని ప్రోత్సహించడంలో ఆనంద పడతాడు. అందుకే మంచి టాలెంట్ ఉన్న సుజిత్ అనే కొత్త కుర్రాడికి ఇంత పెద్ద సినిమా ఛాన్స్ ఇచ్చాడు.. ‘సాహో’ లో నటించిన ప్రభాస్ అందం చూసి తనకే షాక్ అనిపించిందని అలాంటిది అమ్మాయిలు ప్రభాస్ అందం చూసి ఏమైపోతారో తనకు అర్ధం కావడం లేదు అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మూవీతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందనీ ఆమె తన నమ్మకాన్ని తెలియచేసింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ సినిమాను ప్రభాస్ తన అభిమానులతో చూసే విషయమై స్పందిస్తూ ప్రభాస్ కు తన అభిమానులతో తాను నటించిన సినిమాను చూడటం అంటే చాల సిగ్గు పడుతూ ఉంటాడని అందువల్లనే ప్రభాస్ జనంతో కలిసి తన సినిమాలను చూడడు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ‘సాహో’ టాక్ ఇప్పుడు అందరికీ తెలిసి పోవడంతో ఈ వీకెండ్ తో కలిసి వస్తున్న వినాయకచవితి వరకు ఈ మూవీ కలక్షన్స్ విషయంలో ఎటువంటి సమస్యలు లేకపోయినా పండుగ తరువాత వచ్చే మంగళ వారం నుండి ఈ మూవీకి కలక్షన్స్ విషయంలో అసలైన పరీక్ష ఎదురు కాబోతోంది.. అలాగే వచ్చే వారం నాని గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవుతుండడంతో అప్పటివరకు సాహో టీమ్ తమ కలెక్షన్స్ ను రాబట్టుకోవాలని అనుకుంటుంది. చూడాలి మరి ఎంత కలెక్ట్ చేస్తుందో. మరి ప్రభాస్ సాహో టాక్ మీద ప్రభాస్ పెద్దమ్మ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.