శైలజారెడ్డి అల్లుడు టీజర్ ఎలా ఉందంటే..!

566

నాగచైతన్య అనూ ఇమాన్యుయేల్ జంటగా మారుతి దర్సకత్వంలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు విడుదలకు సిద్దమవుతోంది…రమ్యకృష్ణ ముఖ్య పాత్ర ప్పోశిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..కొన్ని రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 31 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నద్ధం చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. అంచనాలకు తగట్టే టీజర్ అదరగొట్టింది. పిల్లా పిట్టల ఇంతే ఉన్న పొట్టంతా ఈగోనే అంటూ రఘు బాబు అంటాడు..ముందు నీవు ఐ లవ్ యు చెప్పు తరువాత నేను లవ్ యు టు చెప్తా అంటూ అను చైతు తో అనగానే పిల్లే ఇలా ఉంటె తల్లి ఎలా ఉంటుందో అని చైతు అనగానే రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చినట్లు టీజర్ కట్ చేసాడు మారుతీ. ఓవరాల్ గా సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. గతంలో వచ్చిన నాగార్జున సినిమా..అల్లరి అల్లుడు మాదిరే ఇది కూడా కామెడీ, రొమాన్స్ కలబోతగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ మూవీ ఫై అక్కినేని అభిమానులతో పాటు చైతు సైతం భారీ ఆశలే పెట్టుకున్నాడు.