“శైలజారెడ్డి అల్లుడు” కి రమ్యకృష్ణ ఎంత తీసుకుందో తెలుసా..!

614

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య అను ఇమాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ కార్యక్రమాలు పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది..ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలవుతుండగా ఆగస్ట్ 31 న విడుదలవుతుంది..

ఈచిత్రంలో శైలజా రెడ్డి అనే ముఖ్య పాత్రలో నాగ చైతన్య అత్త గా నటించింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఈ పాత్రలో నటించినందుకు గాను ఆమె రోజుకు 6లక్షల పారితోషికాన్ని తీసుకున్నారట. దాదాపు ఈ చిత్రానికి ఆమె 22 రోజుల పనిచేశారట ఆలెక్కన ఆమె భారీ పారితోషికాన్ని తీసుకుందని తెలుస్తుంది. ఇక ఆమె ఈచిత్రం తో ఇపుడున్న అక్కినేని హీరోల అందరితోను నటించింది. నాగార్జున తోని గతంలో చాలా చిత్రాల్లో నటించిన రమ్య కృష్ణ, అఖిల్ తో ‘హలో’ అనే చిత్రంలో ఆయనకు తల్లి గా నటించింది.