లీకయిన “శ్రీనివాస కళ్యాణం” స్టోరీ ఇదే..!

516

నితిన్ రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా స్టార్ ప్రొడ్యుసర్ దిల్రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “శ్రీనివాస కళ్యాణం” మూవీ ఈ నెల 9 న విడుదలకు సిద్దమవుతోంది..అయితే ఈ సినిమా కధ ఇదేనంటూ సోషల్ మీడియాలో లీకుల పర్వం మొదలయింది…విషయంలోకి వెళ్తే సంపన్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన హీరో హీరోయిన్లు పేమించుకుంటారు, కానీ వారికి పెళ్లి మీద సరైన అభిప్రాయం ఉండదు. దాంతో ఎప్పుడన్నా గొడవలు వస్తే విడిపోవచ్చు అనే అగ్రిమెంట్ మీద హీరో హీరోయిన్లు ఇద్దరూ కట్టుబడి ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న వారి పెద్దవాళ్ళు, పెళ్లి మీద హీరో హీరోయిన్లకు ఉన్న అభిప్రాయాన్ని పొగడటానికి పెళ్లి విశిష్టతను చాటి చెప్పేలా వారి పెళ్లిని జరిపించి, వారికి కనువింపు కలిగిస్తారు. క్లుప్తంగా ఇదే కథ అని సోషల్ మీడియాలో ఈ పాయింట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన రాశిఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.. పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమా పై నితిన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి నితిన్ ఆశించినట్లు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.