రోడ్డున పడ్డ సౌందర్య కుటుంబం..ఆమె భర్త చేసిన పనికి దిక్కుతోచని స్థితిలో సౌందర్య అన్న కొడుకు..

1834

ఒకప్పుడు సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన హీరోయిన్ సౌందర్య ఎన్నికల ప్రచారానికి వెలుతూ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమరనాథ్ కూడా మరణించారు. అనంతరం సౌందర్య ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. సౌందర్య ఆస్తులు తనకే చెందేలా వీలునామా రాసారంటూ అమర్ నాథ్ భార్య బి. నిర్మల కోర్టు కెక్కారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త జీఎస్ రఘు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత మంజుల, రఘు తనపై కక్ష్య సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారంటూ నిర్మల వారిపై పరువు నష్టం దావా కూడా వేసింది. అయితే కోర్టు వివాదాలు ఉన్నంత కాలం ఆస్తులు చేతికి రావని భావించిన ఇరు వర్గాల కాంప్రమైజ్ అయ్యాయి. పంపకాల విషయంలో రాజీకి రావడంతో పాటు ఈ మేరకు ఒప్పందం కుర్చుకున్నారు.

Image result for soundarya

కోర్టులో ఇరు వర్గాలు కేసులు వాపస్ తీసుకున్నారు. దాని ప్రకారం సౌందర్య పేరుతో ఉన్న రూ. 25 లక్షల బ్యాంకు డిపాజిట్, బెంగులూరు హనుమంతనగర్ లో ఐదు ఇళ్లు మేనల్లుడు సాత్విక్‌ కు చెందుతాయి. నిర్మలకు రూ. 1.25 కోట్ల నగదు చెందుతుంది. సౌందర్య పేరుతో ఉన్న భూమి విక్రయించగా వచ్చిన డబ్బును మంజుల, నిర్మల, సాత్విక్ పంచుకుంటారు. జాయింట్ ప్రాపర్టీ మొత్తం సౌందర్య తల్లి మంజులకు దక్కుతుంది. ఇక సౌందర్య భర్త రఘుకు… బెంగుళూరు మల్లేశ్వరం, హెచ్ఆర్‌బీఆర్ రెండవ సెక్టార్‌లోని ఇంటి స్థలాలు, హైదరాబాద్‌‌లోని కార్యాలయం, హెచ్ఆర్‌బీఆర్ లేఔట్‌లోని ఇంటి స్థలాలు చెందుతాయి. అయితే ఇప్పడూ ఈ ఒప్పందం జరిగింది కానీ కోర్ట్ లో కేసు నడుస్తున్నప్పుడు సౌందర్య వదిన నిర్మల చాలా ఇబ్బందులు పడింది. కొడుకు చిన్నపిల్లాడు కావడంతో ఆమెను ఓదార్చేవాడే లేకుండా పోయాడు.

ఈ క్రింద వీడియో చూడండి

సౌందర్య అన్న అమర్ నాథ్ చెల్లెలి జీవితాన్నే తన జీవితం అనుకున్నాడు. చెల్లెలి సినిమాలను చూసుకుంటూ, ఆమె డేట్స్ చూసుకుంటూ ఎప్పుడు సౌందర్య భవిష్యత్ గురించే ఆలోచించేవాడు.అందుకే చెల్లెలిని ఒంటరిగా పంపకుండా తానూ కూడా ఆమెతో పాటే వెళ్ళిపోయాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత నిర్మల జీవితం తారుమారయ్యింది. అత్తాకోడళ్లకు పడలేదు. దాంతో గొడవలు మొదలయ్యాయి. సౌందర్య తల్లి కూడా అల్లుడికే సపోర్ట్ ఇచ్చింది. అల్లుడు ఇంకొక పెళ్లి చేసుకున్నా కూడా ఏమి అనకుండా ఆస్తిని అల్లుడికి ఇచ్చింది కానీ సొంత మనువడి గురించి పట్టించుకోలేదు. కేసు కోర్ట్ లో ఉన్నప్పుడు కొడుకును చదివించుకోడానికి కూడా నిర్మల దగ్గర లేవు. స్కూల్ ఫీజ్ కట్టే స్థితిలో ఆమె లేదు. అలా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఎవరికీ రావాల్సిన వాటాను వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇకనుంచి అయినా సౌందర్య వదిన కష్టాలు పోయి, కొడుకును మంచిగా చదివించుకోవాలని కోరుకుందాం. మరి సౌందర్య ఆస్థి విషయంలో కుటుంబంలో చెలరేగిన వివాదాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.