రామ్ చరణ్ భార్య ఉపాసన తనతో పాటు తెచ్చుకున్న ఆస్తి విలువ ఎంతో తెలుసా

1837

మెగా స్టార్ చిరంజీవి తనయుడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్,మగధీర తో మెగా హిట్ కొట్టి తెలుగు అగ్ర కథానాయకుల జాబితాలోకి చేరిపోయాడు.అంతే కాకుండా అభిమానుల చేత మెగా పవర్ స్టార్ అని పిలుపించుకునే స్థాయి కి ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో చరణ్ చేరిపోయాడు. చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ సినిమాలపై మంచి ప్యాషన్ తో ముందు నుంచి ఉండేవాడు. చిన్నతనంలో తన తండ్రి బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులు చూసి అలాగే చేయాలి అని అనుకున్నాడు ,ఇంట్లో అందరూ సినిమా రంగంలో ఉండటం, తండ్రి కూడా పెద్ద స్టార్ హీరో అవ్వడం అన్నీ కూడా రామ్ చరణ్ ని తెలుగు తెరపై కనిపించేందుకు కారణం అయ్యాయి.

Image result for ram charan and wife

ఇక పర్సన్ లైఫ్ విషయానికొస్తే, అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనితో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టెంపుల్ హౌస్ లో 2012లో అత్యంత వైభవంగా వివాహం జరిగింది.పవన్ కళ్యాణ్ ప్రాణస్నేహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో పెళ్లి మండపం డిజైన్ చేయడం విశేషం. రామ్ చరణ్ కి అత్తమామలు కట్నంగా 350కోట్లు ఇచ్చినట్లు అప్పటిలో వార్తలు షికారు చేసేవి.
అంతేకాదు చాలా చోట్ల ఖరీదైన భూములు , కొన్ని ఫ్లాట్స్ లాంఛనంగా ఇచ్చారట. ఇక చెర్రీ ఉపాసన పేరెంట్స్ బహుకరించిన ఆస్టిన్ మార్టిన్ కారు మరో ఎత్తు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే ఈ కారు గంటకు 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తుంది. ఇక ఈ కారు ఖరీదు రెండు కోట్ల రూపాయలుంటుంది.

ఈ క్రింద వీడియో చూడండి

అప్పట్లో టాలీవుడ్ లోనే కాదు ఇటు బాలీవుడ్ లో కూడా ఎవరూ ఇంత పెద్ద ఎత్తున కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసింది లేదు.. కాని అపోలో గ్రూప్ అంటేనే ప్రపంచస్ధాయి హస్పటల్స్ ఉన్న గ్రూపు, దేశంలో టాప్ హస్పటల్ గా ఉంది. ఆయన మనవరాలు ఉపాసన కావడం ఆమె కూడా ఈ కార్పొరేట్ కంపెనీ వ్యవహారాలు చూడటం ఇవన్నీ కూడా ఆమెకు కలిసి వచ్చాయి.. ఇటు తండ్రి వైపు అటు తల్లివైపు పెద్ద కుటుంబాలు కావడంతో పెద్ద ఎత్తున పెళ్లికి కూడా ఖర్చు చేశారు.. ఇప్పటి వరకూ జరిగిన వివాహల్లో భారీగా ఖర్చు చేసింది చరణ్ వివాహనికి అంటారు, అయితే చరణ్ నిజంగా కట్నం తీసుకున్నాడా అంటే అది కట్నం కింద ఇచ్చినది కాదు అని ఉపాసనకు ప్రేమతో తల్లి దండ్రులు తాతయ్య ఇచ్చిన లాంచనాలు అని అంటారు కుటుంబ సభ్యులు… ఇటు మెగాస్టార్ కి ఒక్కగానొక్క వారసుడు, పైగా ఆయన కట్న కానుకలకి దూరంగా ఉంటారు.

Image result for ram charan and wife

అందుకే ఉపాసనకు భూముల రూపంలో షేర్ల రూపంలో బంగారం రూపంలో బహుమతిగా అపోలో వారసురాలిగా ఇచ్చారు అని అంటారు, ఇటు సొసైటీలో మెగా కోడలిగా ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.. పేదలకు అనాదలకు సాయం చేయడం అలాగే వారి ఇంట్లో ఎలాంటి చిన్నఫంక్షన్ జరిగినా పేదలకు సాయం చేయండం చేస్తారు ఉపాసన.. ఇవన్నీ ఉపాసనకు చిన్నతనం నుంచి వచ్చిన అలవాట్లుగా చెబుతారు, అందుకే టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబంలో మంచి కోడలు వచ్చింది అని ప్రశసంలు కూడా అందుకున్నారు ఉపాసన. ఇటు తన తండ్రి చిరంజీవిని హీరోగా చేసి, కొణిదెల ప్రొడక్షన్లో సైరా సినిమాని కూడా నిర్మిస్తున్నారు రామ్ చరణ్ అనే విషయం కూడా తెలిసిందే, ఇలా నిర్మాతగా పలు సినిమాలను ట్రాక్ పై తెస్తున్నారు రామ్ చరణ్.