రామ్ చరణ్ కు విలన్ గా ఆర్యన్ రాజేష్…!

578

రంగస్థలం సినిమా తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 12 వ సినిమాను చేస్తున్నారు..యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది..మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారని సమాచారం..బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ అతని సహాయకుడిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది..ఇక గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అయన ఈ చిత్రం తో మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సీనియర్ హీరో హీరోయిన్లు ప్రశాంత్, స్నేహాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్..