రాజ్ తరుణ్ కి షాకిచ్చిన పోలీసులు కేసు నమోదు

59

హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ దగ్గర సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత జరిగిన కారు ప్రమాదం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో ఎస్90 లగ్జరీ కారు అల్కాపురి టౌన్‌షిప్ సమీపంలో ఉన్న నార్సింగి సర్కిల్ వద్ద రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ కారు హీరో తరుణ్‌ది అని, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి పారిపోయారని ప్రచారం జరిగింది. పలు టీవీ ఛానెళ్లలో ఈ వార్తను మంగళవారం ఉదయం ప్రసారం చేశారు. అయితే, ఈ యాక్సిడెంట్ చేసింది మరో హీరో రాజ్ తరుణ్ అని తరవాత తెలిసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాజ్ తరుణ్‌ను గుర్తించారు.

Image result for raj tharun

యాక్సిడెంట్ చేసింది రాజ్ తరుణ్ అయినప్పటికీ ఆ కారు ఆయన పేరు మీద రిజిస్టర్ అయ్యిలేదు. లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని పోలీసులు తెలిపారు. యజమాని పేరు ప్రదీప్ అని వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన తరవాత కారును అక్కడే వదిలిపెట్టి రాజ్ తరుణ్ పారిపోయారు. ఇలా ఎందుకు పారిపోయారో.. ఆయన ఎక్కడ ఉన్నారో అని రాజ్ తరుణ్ అభిమానులతో పాటు పోలీసులు ఆందోళనపడ్డారు. కారు ఓనర్ ప్రదీప్‌ను విచారించారు. మొత్తానికి రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానన్నారు.

Related image

నా గురించి ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇంటి నుంచి కారులో బయటికి వచ్చిన నేను.. మూడు నెలలుగా తరచూ ప్రమాదాలు జరుగుతోన్న నార్సింగ్ సర్కిల్ మీదుగా వెళ్లాను. సర్కిల్ దగ్గర వెంటనే కుడివైపునకు మళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక కంట్రోల్ తప్పాను. రోడ్డు పక్కన ఉన్న గోడను కారు ఢీకొట్టింది. ఆ శబ్ధానికి నా చెవులు మూసుకుపోయాయి. కళ్లు సరిగా కనిపించలేదు. గుండె వేగంగా కొట్టుకుంది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థంకాలేదు. అప్పటికి సీటు బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. ఒకసారి నాకు నేను చెక్ చేసుకున్నాను. వెంటనే కారులో నుంచి దిగి ఇంటికి పరిగెత్తాను. సాయం తీసుకున్నాను అని రాజ్ తరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకుంటున్నానని, కొద్ది రోజుల్లో మళ్లీ షూటింగ్‌కు వెళ్తానని చెప్పారు.

ఈ క్రింద వీడియో చూడండి

దీంతో హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు…అందరికి థ్యాంక్స్ చెపుతూ ప్రమాధానికి సంబంధించిన నేరాన్ని రాజ్ తరుణ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొనటంతో ఆయనపై కేసు నమోదు చేశారు . కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారు. మరి.. పోలీసుల విచారణలో రాజ్ తరుణ్ ఏం చెబుతారో చూడాలి.