రాజకీయాల్లోకి ప్రభాస్? బీజేపీలో చేరుతున్నారా?… కృష్ణం రాజు సమాధానం ఇదీ!

107

ప్రభాస్..అమ్మాయిల రాకుమారుడు. పెదనాన్న నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తనదైన శైలి నటనతో రాణిస్తున్నాడు. దేశం గర్వించదగిన సినిమా ‘బాహుబలి’లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ప్రభాస్ మాత్రం తెలుగు సినెమాలకే పచ్చజెండా ఊపుతున్నాడు. బాహుబలి తరువాత సాహో సినిమా చేస్తున్నాడు.

Image result for prabhas and modi

అయితే ప్రభాస్ గురించి కొన్ని రోజులుగా పొలిటికల్ ఫీల్డులో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. కృష్ణం రాజు వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ త్వరలో పెదనాన్న బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణం రాజు బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి ప్రభాస్ కూడా భాజపా తీర్థం పుచ్చుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణం రాజు ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం కృష్ణంరాజుగారి టార్గెటా? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు రెబల్ స్టార్ తనదైన శైలిలో స్పందించారు. ప్రభాస్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో, తెలుగు ప్రజలకో పరిమితం అయితే ఒకరకం. ఇండియాకు పరిమితం అయితే ఇంకో రకం. కానీ ఇపుడు ప్రభాస్ స్థాయి ఇంటర్నేషనల్ లెవల్. అందుకే ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? అనేది ఇపుడే మాట్లాడటం టూ ఎర్లీ అంటూ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

ఈ క్రింద వీడియో చూడండి

గతంలో బాహుబలి విజయం తర్వాత కృష్ణంరాజు తన వెంట ప్రభాస్‌ను తీసుకెళ్లి ప్రధానమంత్రి మోదీని కలవడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ పొలిటికల్ ఫీల్డ్ వైపు వస్తున్నారని, బీజేపీలో చేరుతున్నారనే చర్చ మొదలైంది. ప్రభాస్, బీజేపీ వార్తలపై కృష్ణం రాజు స్పందిస్తూ… బాహుబలి సినిమా అమిత్ షా, రాజనాథ్ సింగ్ చూశారు. వారు నా కొలీగ్స్. మోడీ గారితో 25 సంవత్సరాల స్నేహం. నేను 1998లో ఎంపీగా ఉన్నపుడు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండేవారు. అపుడు మేము పార్టీ విషయాలు చర్చించుకునే వారం. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో సున్నా నుంచి నాలుగు సీట్లు తీసుకొచ్చింది నేనే అని చెబుతుండేవారు. వారు నాకు చాలా దగ్గర కాబట్టి ప్రభాస్‌ను వారికి పరిచయం చేశానే తప్ప, మరో కారణం ఏమీ లేదని తెలిపారు. ప్రభాస్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడం అనే టార్గెట్ నాకేమీ లేదు. ఒక ఫ్రెండుగా పొలిటికల్ విషయాల గురించి చర్చిస్తాను, సజ్జెస్ట్ చేస్తాను. అంతే కానీ డిక్టేట్ చేయను. ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిన తర్వాత అతడిపై చాలా బర్డెన్ ఉంది. ముందు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. రాజకీయాల గురించి ఆలోచించడానికి చాలా సమయం ఉందని కృష్ణం రాజు స్పష్టం చేశారు.