మెగా డాటర్ కు మెగా ఫ్యాన్స్ షాక్..!

546

మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా మొదలైన మెగా ఫ్యాన్స్ ఆ తరువాతి కాలంలో పవన్ కళ్యాణ్ కు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిదరం తేజ్ కు అండగా నిలిచారు..మెగా అభిమానుల మనసుల్ని దోచుకోలేకపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే అది అల్లు శిరీశ్.. ఇటీవల విజేత ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ లను చెప్పాలి. ఇప్పుడు ఆ జాబితాలో మెగా డాటర్ నిహారిక కూడా చేరిందా? అన్నది ప్రశ్నగా మారిందని చెబుతున్నారు.

మెగా క్యాంప్ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటమే సంచలనం అయితే.. ఆమె నటించిన ఒక మనసు మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. మెగా అభిమానుల పుణ్యమా అని మినిమం గ్యారెంటీ అనుకున్నా.. ఆ మూవీ మాత్రం నిరాశను మిగిల్చింది. కాస్త గ్యాప్ తీసుకొని హ్యాపీ వెడ్డింగ్ తో మరోసారి వెండితెర మీద తళుక్కుమన్నారు. ఈ మూవీ టీజర్ ఆసక్తిని రేపటంతో పాటు.. సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగేలా చేశాయి. అయితే.. ఈ మూవీ విడుదలైన మొదటి రెండు రోజుల్లో కలెక్షన్లు ఏ మాత్రం ఎంకరేజింగ్ గా లేవన్న మాట వినిపిస్తోంది.

వీకెండ్ ఎలాంటి కిక్ ఇవ్వలేదన్న మాటను చెబుతున్నారు. మెగా హీరోలను ఆదరించిన మెగా ఫ్యాన్స్.. మెగా డాటర్ పై తమ అభిమానాన్ని కలెక్షన్ల రూపంలో కురిపించటానికి ఆసక్తి చూపించకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. మూవీ మీద పాజిటివ్ టాక్ రాకపోవటమే కారణంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అభిమానం ఉన్నా.. సినిమా బాగోకున్నా.. సినిమాకు వెళ్లి చూసే రోజులు పోయాయన్నమాట వినిపిస్తోంది. ఏమైనా.. మెగా ఫ్యాన్స్ మీద ఆశలు పెట్టుకున్న నిర్మాతలకు మాత్రం హ్యాపీ వెడ్డింగ్ తో అన్ హ్యాపీనే అన్న మాట వినిపిస్తోంది.