మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా “సైరా” టీజర్…!

468

మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నతీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సిరా నరసింహా రెడ్డి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది…చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు..తమిళ నటుడు విజయ్ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు, తమన్నా లు ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం..స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు..

కాగా ఈ చిత్ర బృందం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. టీజర్‌ను ఆగస్టు 21న ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 22న చిరు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుంటూ అభిమానులకు కానుకగా సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరు 2017లో ‘ఖైదీ నంబర్‌ 150’తో సందడి చేశారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.‌ దీని తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.