మెగాస్టార్ చిరంజీవి రియల్ స్టోరీ

120

అతడు కనిపిస్తే ప్రభంజనం.. స్క్రీన్‌పై మెరిస్తే అరాచకం.. డాన్సులు వేస్తే అభిమానుల ఒంట్లో కరెంట్ ప్రవాహం.. డైలాగులు చెబుతుంటే ఉప్పొంగే ఆనందం.. స్టైల్‌గా చూస్తే రికార్డుల కోలాహలం.. ఇలా ఒక్కటేంటి.. అతడేం చేసినా అభిమానులకు అదో పండగే. ఇంతటి స్టార్ ఇమేజ్ ఎవరికైనా ఉంటుందా అసలు అనేంతగా క్రేజ్. ఇవన్నీ ఒకేఒక్క స్టార్‌కు సొంతం. అతడి పేరు చిరంజీవి.. కాదు కాదు మెగాస్టార్, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనతో పాటు నిర్మాతగా, బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

Related image

బాల్యం, చదువు…
చిరంజీవి ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చిరంజీవి తన స్కూల్ ఎజుకేషన్ ను ఒంగోలు లో పూర్తీ చేశాడు. అలాగే ఇంటర్ విద్యను ఒంగోలులో ఉన్న CSR శర్మ కాలేజీలో చదివాడు. ఆ తరువాత శ్రీ YN కాలేజీ, నర్సాపూర్ లో తన డిగ్రీని పూర్తీ చేశాడు.

Image result for megastar

ఫ్యామిలీ…..
చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఇతను కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు. కూతుళ్లు సుష్మిత,శ్రీజ. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కథానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు.

Image result for megastar

సినీ కెరీర్….
చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా ‘బ్రేక్ డ్యాన్స్’ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు. మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. రాజకీయాల తరువాత మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యి చిరు రీ ఎంట్రీ ఘనం గా సాగింది..ఆ సినిమా లో చిరు చాలా చలాకీగా నటించాడు,బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం టోటల్ టాలీవుడ్ ఎదురుచూస్తుంది.

Image result for megastar

రాజకీయం….
చిరంజీవి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాని పేరు ప్రజారాజ్యం. ఇది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని ఈ పార్టీని స్థాపించడం జరిగింది. 2009 ఎన్నికలలో పోటీ ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఆ తర్వాత రాజకీయాలలో మసలలేక 2011, ఫిబ్రవరి 6 వతేదీన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

Related image

సేవా కార్యక్రమాలు, సత్కారాలు..
చిరంజీవి అక్టోబర్ 2, 1998లో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించాడు. ‘చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బాంక్’ ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి.. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా .. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు ‘అత్యుత్తమ సేవా సంస్థలు’గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

ఈ క్రింద వీడియో చూడండి

అవార్డ్స్….
చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు. 9 ఫిలింఫెర్ అవార్డ్స్, 4 నంది అవార్డ్స్, ఒక సైమా అవార్డులు అందుకున్నాడు. అలాగే చిరంజీవి జనవరి,2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి పద్మభూషణ్ పురస్కారం, నవంబరు 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ నుండి అందుకున్నారు. చిరంజీవి ఇంకా ఇలాగే మంచి పనులు చేసి ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుందాం. మరి చిరంజీవి గురించి అయన సాధించిన విజయాలు, అందుకున్న సత్కారాలు, సినిమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.