మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమావేశంలో పాము కలకలం

27

గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతలో పర్యటిస్తున్నారు. మంగళగిరితో పాటు చుట్టుపక్కల రాజధాని ప్రాంతాల రైతులతో ఆయన సమావేశమయ్యారు. రాజధాని తరలిస్తారన్న ప్రచారం నేపథ్యంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిన్న కూడా పార్టీ కార్యాలయంలో రైతులతో భేటీ అయ్యారు పవన్. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విన్నవించారు. తమకు న్యాయం చేయాలంటూ పవన్‌ను విజ్ఞప్తి చేశారు. అయితే ఈ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఒక పాము హల్‌చల్ చేసింది. రాజధాని రైతులతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహిస్తుండగా పాము వచ్చింది. పామును చూసి రైతులు, పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాన్ పక్కన నుంచే ఈ పాము పోయింది. తృటిలో ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే అక్కడ కార్యకర్తలు అప్రమత్తమై పామును చంపేసి దూరంగా పడేశారు. దాంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమావేశంలో పాము కలకలం

ఇక ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ చేశారు. రాజులూ మారితే రాజ్యం మారాలా..ఇదెక్కడ జరగదు అని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి రాజకీయాలు జరిగాయో, ఇప్పుడు రాజధాని విషయంలోనూ అలాంటి రాజకీయాలే జరుగుతున్నాయని మండిపడ్డారు.అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని..అలాగని ఇష్టమొచ్చినట్లు చేస్తామని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టినా జగన్ ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్ధం కావడం లేదని తెలిపారు. 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి..ఆ పార్టీ నేతలు దొనకొండలో భూములు కొన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారని పవన్ అన్నారు. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే..ప్రధాని మోదీ, అమిత్‌షాను కలుస్తామని స్పష్టంచేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

అలాగే రాజధాని విషయంలో ఏపీ మంత్రి బొత్స చేసిన కామెంట్స్ మీద పవన కళ్యాణ్ స్పందించాడు. బొత్స సత్యనారాయణ మీద త్వరలో ఫోక్స్ వ్యాగన్ కేసు బయటకు వస్తుందనే సంకేతాలు ఇచ్చారు. ‘అమరావతికి శంకుస్థాపన చేసింది మోదీనే. బొత్స అమరావతిని కాదన్నారంటే మోదీని వ్యతిరేకిస్తున్నట్టే. అమిత్ షాను వ్యతిరేకిస్తున్నట్టే. అలా చేస్తే ఫోక్స్ వ్యాగన్ కేసు వస్తుంది.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోదీ గురించి తనకు తెలుసని, అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని సహించే వ్యక్తి కాదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బొత్స సత్యనారాయణ జగన్ మోహన్ రెడ్డి మాయలో పడొద్దని సూచించారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యే చెడు వార్తలను చేరవేసే వారధిగా మారొద్దన్నారు. విధ్వంసానికి సంబంధించిన వార్తలన్నీ బొత్స నోటి నుంచే వస్తున్నాయని, జగన్‌కు దగ్గరగా ఉండే వారి నుంచి ఇలాంటి మాటలేవీ రావడం లేదని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. ‘గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. ఏపీకి చివరి సీఎం కావాలని అనుకున్నారు. భవిష్యత్తులో సీఎం కావాలని మారుమూల కోరిక ఉంది. దానికి ప్రజల అభిమానం సంపాదించాలి. జాగ్రత్తగా మాట్లాడండి.’ అని పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి కామెంట్ చేశారు. మరి ఏపీ పర్యటనలో భాగంగా జగన్ , బొత్స మీద పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.